బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది పెద్ద వార్తే. దీపికా పదుకొణె(Deepika Padukone), రణవీర్ సింగ్(Ranveer singh) తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పోస్టు చేశారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది పెద్ద వార్తే. దీపికా పదుకొణె(Deepika Padukone), రణవీర్ సింగ్(Ranveer singh) తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పోస్టు చేశారు. ఈ పోస్టుతో దీపికా గర్భవతి అయినట్లు వస్తున్న వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇటీవలే ఓ అవార్డు షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన దీపిక.. చీర కట్టుకుని కనిపించింది. దీపికా పోస్టుపై కూడా పలువురు స్పందిస్తున్నారు. పలువురు సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె ఛపాక్ సహనటుడు విక్రాంత్ మాస్సే "బహుత్ బహుత్ శుభకమ్నేన్" అని రాశారు. సోనాక్షి సిన్హా, కృతి సనన్(Kriti sanon), సోనమ్ కపూర్(Sonam kapoor) వంటి సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు.
2013లో విడుదలైన ‘రామ్ లీలా’ కోసం దీపిక-రణ్‌వీర్ తొలిసారి కలిసి పని చేశారు. ఈ సినిమా టైమ్‌లో దీపికతో ఆయనతో ప్రేమలో పడ్డారు. 2018, నవంబర్‌లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. తమ బంధాన్ని శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు. ఈ మధ్య ఈ జంట ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’లో పాల్గొన్నారు. వారి పెళ్లికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఈ షోలో తెలిపారు. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లోనే తొలిసారి వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకొణెను పిల్లల గురించి ప్రశ్నించగా ఆమె సమాధానమిస్తూ "రణ్ వీర్, నేను పిల్లలను ప్రేమిస్తాం. సొంత కుటుంబాన్ని ప్రారంభించే రోజు కోసం ఎదురు చూస్తున్నాం" అని దీపిక పదుకొణె తెలిపింది.