యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)-డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30(NTR30) చిత్రం ప్రారంభమైన సంగతి మీకు తెలిసిందే. ఎన్టీఆర్ 30 పేరుతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‏లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)-డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30(NTR30) చిత్రం ప్రారంభమైన సంగతి మీకు తెలిసిందే. ఎన్టీఆర్ 30 పేరుతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‏లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్‏గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటోలను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ 30 చిత్ర టీమ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)‏కు గ్రాండ్ వెల్‏కమ్ పలికింది. నేషనల్ అవార్డు గ్రహీత ఈ హై వోల్టేజీ యాక్షన్ డ్రామాలో చేరాడంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

అయితే ఎన్టీఆర్, సైఫ్ సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి ఆర్‏ఎఫ్‏సీలో (Ramoji Film City) సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పార్ట్ షూటింగ్ జరగనుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ (NTR), సైఫ్ అలీ ఖాన్ కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న 'ఆదిపురుష్'లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ నెల 16న థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Updated On 18 April 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story