ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) జీవితగాధ(Biopic) వెండితెరపైన చాలా సార్లు ఆవిష్కృతమయ్యింది. అనేక భాషలలో శివాజీ సినిమా తీశారు. సూపర్‌స్టార్ కృష్ణకు(Krishna) శివాజీ పాత్ర వేయాలన్న కోరిక బలంగా ఉండింది. అదలా ఉంచితే ఇప్పుడు రితేష్ దేశ్‌ముఖ్(Ritesg deshmukh) కూడా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను తీస్తున్నారు.

Ritesh Deshmukh
ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) జీవితగాధ(Biopic) వెండితెరపైన చాలా సార్లు ఆవిష్కృతమయ్యింది. అనేక భాషలలో శివాజీ సినిమా తీశారు. సూపర్‌స్టార్ కృష్ణకు(Krishna) శివాజీ పాత్ర వేయాలన్న కోరిక బలంగా ఉండింది. అదలా ఉంచితే ఇప్పుడు రితేష్ దేశ్‌ముఖ్(Ritesh deshmukh) కూడా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌ను తీస్తున్నారు. సోమవారం ఆయన శివాజీ జయంతిని పురస్కరించుకుని రాజా శివాజీ(Raja Shivaji) అనే టైటిల్‌ను రితేష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ జీవిత కథలో టైటిల్‌ను రితేష్ పోషిస్తున్నారు. పైగా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది పేరు మాత్రమే కాదు ఒక భావోద్వేగమని చెప్పిన రితేష్ దేశ్‌ముఖ్ ఈ మట్టిలో పుట్టిన ఈ మాణిక్యానికి నివాళులు అర్పించారు. ఆయన వారసత్వం రాబోయే తరా లకు స్ఫూర్తిగా నిలుస్తుందని, తమ ఈ నూతన ప్రయాణానికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు రితేష్. కాగా, రెండేళ్ల క్రితం దర్శకుడిగా తొలి చిత్రం వేద్‌ను తెరకెక్కించారు రితేష్. మరాఠీని తీసిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. మలి ప్రయత్నంగా ఛత్రపతి శివాజీ వంటి భారీ బయోపిక్‌ను రూపొందించనున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో నిర్మితమవుతోంది. జియో స్టూడియోస్ సమర్పణలో ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రితేష్ భార్య, నటి జెనీలియా ఓ నిర్మాత. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.
