ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి(Mithun Chakravarthy) గుండెనొప్పి(Heart attack) రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Mithun chakraborty
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి(Mithun Chakravarthy) గుండెనొప్పి(Heart attack) రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ అయిన మిథున్ చక్రవర్తి ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన మొదటి సినిమా మృగయా! ఈ సినిమాకు గాను ఆయనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. డిస్కో డాన్సర్ సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. గతంలో కిడ్నీ సమస్యతోనూ మిథున్ బాధపడ్డారు. రెండేళ్ల కిందట బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ దగ్గర నొప్పి రావడంతో కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
