దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. చిన్న పిల్లాడిని అడిగినా..అబానీ,ఆదాని అని చెప్పేస్తారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు వారు. ముఖ్యంగాదేశంలో టాక్స్ రూపంలో వచ్చే సొమ్ములో.. ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా... లాంటి వారిభాగమే ఎక్కువ.. అయితే ఈసారి మాత్రం అందరిని ఆశ్చర్య పరుస్తూ..

దేశంలో సంపన్నవంతులు అంటే గుర్తుకొచ్చేది ఆదాని(adani), అంబానీలు(ambani).. కాని వారికంటే కూడా తాను మరింత స్పెషల్ అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.

దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. చిన్న పిల్లాడిని అడిగినా..అబానీ,ఆదాని అని చెప్పేస్తారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు వారు. ముఖ్యంగాదేశంలో టాక్స్ రూపంలో వచ్చే సొమ్ములో.. ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా... లాంటి వారిభాగమే ఎక్కువ.. అయితే ఈసారి మాత్రం అందరిని ఆశ్చర్య పరుస్తూ.. ఆదానీలను అంబానీలను మించిపోయాడు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తి ఏ వ్యాపారవేత్తా కాదు... బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్(akshay Kummar). ఇది నిజంగా ఆశ్చర్యకర అంశమే.

ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం అక్షయ్ కుమార్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.29.5 కోట్ల పన్నును చెల్లించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.486 కోట్ల ఆదాయాన్ని ఆయన చూపించారు.బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేవారిలో అక్షయ్ కుమార్ ముందుంటారు. ఆయన ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. దీంతో పాటు అతను తన ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్ ను నిర్వహిస్తున్నారు. అలాగే, ఆయా కంపెనీల ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలోను అత్యధిక పన్ను చెల్లింపుదారుగా రూ.25.5 కోట్లతో అక్షయ్ కుమారే ముందున్నారు.

ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామిక దిగ్గజాల పేర్లు రాకపోవడానికి కారణమూ ఉంది. వీరి ఆస్తులు ఎక్కువగా కంపెనీల పేరిట ఉంటాయి. ఆదాయాలు కూడా అధికం కంపెనీల వాటాగా వెళతాయి. కాబట్టి వ్యక్తిగత అత్యదిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమారే గత కొన్నేళ్లుగా ముందు నిలుస్తున్నారు.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated On 1 Aug 2023 3:29 AM GMT
Ehatv

Ehatv

Next Story