ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోన్న మెల్ స్టార్ బయటకు వస్తున్నారు. ఆడవారికే కాదు.. మగవారికి కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధలు తప్పడం లేదు.ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అంటే.. ప్రతీ ఆర్టిస్ట్ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోక తప్పడంలేదు. ఏబ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలోకి వస్తే.. ఎవరో ఒకరిని సుఖపెట్టాల్సింది. అయితే అమ్మాయిలు అందుకే ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతుంటారు.

ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కాస్టింగ్ కౌచ్(Casting Couch) ను ఎదుర్కోన్న మెల్ స్టార్ బయటకు వస్తున్నారు. ఆడవారికే కాదు.. మగవారికి కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధలు తప్పడం లేదు.

ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అంటే.. ప్రతీ ఆర్టిస్ట్ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోక తప్పడంలేదు. ఏబ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వస్తే.. ఎవరో ఒకరిని సుఖపెట్టాల్సింది. అయితే అమ్మాయిలు అందుకే ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతుంటారు. కొంత మంది ఈ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోంటుంటారు. కొంత మంది తప్పక లొంగిపోతుంటారు. అయితే ఈమధ్య కాస్టింగ్ కౌచ్ పై మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అయితే చిత్రం ఏంటీ అంటే.. గత కొద్ది కాలంగామేము కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాం అంటూ.. మగవారు కూడా బయటకు వస్తున్నారు. తమఅనుభవాలు పంచుకుంటున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry)లో అబ్బాయిలకు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధలు తప్పడం లేదు. అయితే అందరూ ఈ విషయాలు చెప్పుకోలేరు కదా.. కొంత మంది మాత్రమే బయటకు వచ్చి తమ సమస్యలను బయటపెడుతున్నారు. అయితే ఇక్కడ అబ్బాయిలకు ఈసమస్య రెండు విధాలుగా ఎదురవుతుంది. ఆడవారికి మగవారి నుంచే సమస్య అయితే.. అబ్బాయిలకు ఆడ,మగ రెండు వర్గాల నుంచి కాస్టింగ్ కౌచ్ తప్పడం లేదు. రీసెంట్ గా ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్(Ravikishan) కాస్టింగ్ కౌచ్ పై తన అనుభవాలు పంచుకున్నారుు. కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్(Bollywood) లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. నన్ను కూడా కాస్టింగ్ కౌచ్ చేశారు. ఒక ఆవిడ నాకు రాత్రికి కాఫీ ఆఫర్ చేసి రమ్మంది. ఆమె అప్పుడు మాట్లాడిన మాటలు, చెప్పే విధానం నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమె చాలా పెద్ద బిగ్ షాట్ అయింది. ఆమె పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు అని అన్నారు.

ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ యంగ్ స్టార్ కూడా.. తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గురించి వివరించాడు. హిందీ బిగ్‌బాస్‌ 16(Hindi Big Boss) తో బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యాడు శివఠాక్రే. ఈ యంగ్ స్టార్ కూడా రీసెంట్ గా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడు అవకాశాలు సాధిస్తూ వస్తున్న ఈ హీరో.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉంటాయి. రీసెంట్ గానే నాకు ఈ అనుభవం అయ్యింది అన్ననాడు ఒకసారి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఓ డైరెక్టర్ ఆడిషన్ అయ్యాక మసాజ్ సెంటర్ కి రమ్మన్నాడు.. కాని నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు.. అందుకే పోలేదు అన్నారు.

ఇక మరో సారి ఓలేడీ కూడా తనకు ఆఫర్ చేసిందన్నారు శివ. సినిమాల్లో ఛాన్సుల కోసం తిరుగుటూ.. కష్టపడుతుంటే.. ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ అర్ధరాత్రి 11 గంటలకు నన్ను తన ఇంటికి ఆడిషన్ కి రమ్మంది. తన వల్ల చాలా మంది స్టార్స్ ను చేసిందని.. తన దగ్గరకు వస్తే.. తనను కూడా స్టార్ను చేస్తానంది. ఆమె చెప్పేది నాకు అర్థమయి నేను సీరియస్ గా రానని చెప్పడంతో నీకు ఇండస్ట్రీలో పని చేయాలని లేదా? నువ్వు రాత్రికి రాకపోతే నీకు పని దొరకదు ఇక్కడ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అని అన్నారు శివ థాక్రే. ఇతనే కాదు.. చాలా మంది స్టార్స్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నవారే.

Updated On 31 March 2023 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story