యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) కాసింత భిన్నంగా బర్త్‌డే విషెస్‌ చెప్పారు. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో త్వరలో వార్‌ 2(War-2) సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! ఇదే విషయాన్ని హృతిక్‌ రోషన్‌ బర్త్‌ డే విషెస్‌లో సూచనప్రాయంగా చెప్పాడు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) కాసింత భిన్నంగా బర్త్‌డే విషెస్‌ చెప్పారు. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో త్వరలో వార్‌ 2(War-2) సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! ఇదే విషయాన్ని హృతిక్‌ రోషన్‌ బర్త్‌ డే విషెస్‌లో సూచనప్రాయంగా చెప్పాడు. హ్యపీ బర్త్‌డే తారక్‌. ఈ ఏడాది మరింత ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా. నీ కోసం యుద్ధభూమిలో(Battle field) ఎదురుచూస్తున్నాను. మనం కలిసేంత వరకు నీ ప్రతిరోజు సంతోషంగా, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశాడు హృతిక్‌ రోషన్‌. చివరలో పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అని తెలుగులో చెప్పారు హృతిక్‌ రోషన్‌. త్వరలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌లు వార్‌ 2 సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే! యశ్‌రాజ్‌ ఫిలింస్‌(Yash raj films) స్పై ఫ్రాంచైజీలోని వార్‌ సినిమాకు స్వీక్వెల్‌గా ఈ సినిమా రాబోతున్నది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో భారీ ఎత్తున ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది.

Updated On 20 May 2023 5:58 AM GMT
Ehatv

Ehatv

Next Story