బిగ్ బాస్ సీజన్ 5తో తెలుగు టెలివిజన్‏కు పరిచయమైన తొలి ట్రాన్స్‏జెండర్ ప్రియాంక సింగ్ (Priyanka Singh).. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక పింకీ‏(Pinky) గా మంచి పేరు తెచ్చుకుంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 5లో పార్టిసిపేట్ చేసేందుకు ఆమె అందం, వ్యక్తిత్వం బాగా కలిసొచ్చాయి. కంటెస్టెంట్‏గా పింకీ బిగ్ బాస్ హౌస్‏మేట్స్‏తో పాటు ఆడియన్స్ నుంచి అప్లాజ్ అందుకుంది. జెండర్ గుర్తింపు విషయంలో ఆమె చాలా స్ట్రగుల్స్‏ను ఫేస్ చేసింది.

బిగ్ బాస్ సీజన్ 5తో తెలుగు టెలివిజన్‏కు పరిచయమైన తొలి ట్రాన్స్‏జెండర్ ప్రియాంక సింగ్ (Priyanka Singh).. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక పింకీ‏(Pinky) గా మంచి పేరు తెచ్చుకుంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 5లో పార్టిసిపేట్ చేసేందుకు ఆమె అందం, వ్యక్తిత్వం బాగా కలిసొచ్చాయి. కంటెస్టెంట్‏గా పింకీ బిగ్ బాస్ హౌస్‏మేట్స్‏తో పాటు ఆడియన్స్ నుంచి అప్లాజ్ అందుకుంది. జెండర్ గుర్తింపు విషయంలో ఆమె చాలా స్ట్రగుల్స్‏ను ఫేస్ చేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తర్వాత ఈ మోడల్‏కు అనుకున్నంత రేంజ్‏లో అవకాశాలు రాలేదు. దీంతో పింకీ తన హాట్‏హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‏లోడ్ చేయడం మొదలు పెట్టింది. తాజాగా ప్రియాంక టవల్‏తో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టా‏గ్రామ్ పేజ్‏లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు ఇంటర్నెట్‏లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. ఈ హాట్‏హాట్ ఫొటోలకు ఒక స్పెషల్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అదేంటంటే.. ‘‘ఇది నగ్నత్వం కాదు.. గుర్తుపెట్టుకోండి నేను కేవలం కళాకారుడిని మాత్రమే ! నా అందాన్ని మీ హృదయంతో మాత్రమే చూడండి.. మీ కామపు కళ్లతో కాదు’’ అంటూ రాసుకొచ్చింది.

ఇక అనుకున్నట్టుగానే ప్రియాంక సింగ్ (Priyanka Singh) ఫాలోవర్స్ ఒకరిద్దరు ఆ ఫొటోల గురించి లెక్చర్లు కూడా ఇస్తున్నారు. అవకాశాల కోసం ఇలాంటి ట్రిక్స్ చేస్తూ.. ఆమె దిగజారిపోతుందని కొందరు బలంగా చెప్తున్నారు. అయితే ఆమె అభిమానుల్లో చాలా మంది వరకు పాజిటివ్‏గా రియాక్ట్ అవుతుంటే.. కొందరేమో నెగెటివ్‏గా కమెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో ఫాలోవర్ అయితే మరి ఇలా దిగజారిపోయి ఆడవాళ్ల పరువు తీయకండి అని నమస్కారం పెట్టే ఎమోజీలను జోడించి కమెంట్ చేశాడు. ఇక మరో ఫాలోవర్ ప్రమీళదేవి అనే అమ్మాయి అయితే ‘‘ నిన్ను చూశాక ట్రాన్స్ జెండర్ మీద గౌరవం పెరిగింది కానీ నువ్వు ఇలా బిహేవ్ చేస్తుంటే నిన్ను ఎందుకు ఫాలో అయ్యానా అని బాధపడుతున్నా షేమ్ ఆన్ యూ’’ అంటూ కమెంట్ చేసింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక సింగ్ టీవీ షోలు, రియాలిటీ షోలతోపాటు పలు ఈవెంట్లు చేస్తోంది. అయితే ఆమె కెరీర్‏లో నిలదొక్కుకునే అవకాశం కోసం వేచి చూస్తోంది.

Updated On 11 May 2023 9:25 PM GMT
Ehatv

Ehatv

Next Story