అందరు తారలు అవకాశాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే.. తాను మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నాడు. సినిమాలు పక్కన పెట్టి.. టూర్లు వెళ్తున్నాడు. రకరకాల ప్రదేశాలు తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు తాజాగా ఈ బిగ్ బాస్ విన్నర్(Bigg Boss Winner).. ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం(Farming) కూడా చేస్తానంటున్నాడు.

యంగ్ హీరోలంతా ఒక దారిలో వెళ్తుంటే... తాను మాత్రం మరోదారిలో వెళ్తున్నాడు టాలీవుడ్ హీరో.. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్(Abhijeet ).. ఇంతకీ యంగ్ స్టార్ ఏమంటున్నాడంటే..?

అందరు తారలు అవకాశాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే.. తాను మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నాడు. సినిమాలు పక్కన పెట్టి.. టూర్లు వెళ్తున్నాడు. రకరకాల ప్రదేశాలు తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు తాజాగా ఈ బిగ్ బాస్ విన్నర్(Bigg Boss Winner).. ట్రాక్టర్ ఎక్కి వ్యవసాయం(Farming) కూడా చేస్తానంటున్నాడు.

బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ లో .. టాలీవుడ్ యంగ్ హీరో అభిజిత్ కూడా ఒకరు. హీరోగా రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన అబిజిత్. బిగ్ బాస్ లోకి వచ్చి... తను ఎలా ఉంటాడో అలానేఉండి.. ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ షో ద్వారా అభిజిత్ ఇమేజ్ తో పాటు.. పాపులారిటీ కూడా బాగా పెరిగింది. అయితే రు. అభిజిత్ ఈ షో ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. కాని బిగ్ బాస్ షో తర్వాత అభిజిత్ కెరీర్ లో బాగా బిజీ అవుతారు అనుకుంటే అందుకు డిఫరెంట్ గా ఆయన ఆలోచిస్తున్నాడు.

బిగ్ బాస్ తరువాత అభిజిత్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కాని వాటిని పెద్దగా పట్టించుకోలేదు అభిజిత్. ఈ షో తరువాత ఒక వెబ్ సిరీస్ లో మాత్రమే నటించారు.. ఆరువాత ట్రెవెలర్ అవతారం ఎత్తి.. వరుసగా టూర్లు ప్లాన్ చేశాడు. దేశ విదేశాలు తిరుగుతూ.. తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు. అంతే కాదు మరో వాదన ఏంటంటేు.. అభిజిత్ ఆరోగయం బాగా ఉండటంలేదని.. అందుకే ఆయన సినిమాలు చేయకుండా.. లైఫ్ లో తనకు ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్ ను తీసుకుని.. తాను అనుకున్న ప్రాంతాలు తిరుగుతున్నాడని తెలుస్తోంది. అంతే కాదు.. దానికి కావల్సిన టీమ్ తో పాటు.. ఎక్యూమ్మెంట్.. అన్నీ సెట్ చేసుకున్నాడు అభిజిత్. తన వీడియోలు అన్నీ.. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేస్తున్నాడు అభిజిత్.

అభిజిత్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటో హాట్ టాపిక్ అవుతోంది. ట్రాక్టర్ ఎక్కి బిగ్ బాస్ అభిజిత్ వ్యవసాయం చేస్తుండగా ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అభిజిత్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది. భారత్ మాతాకీ జై అంటూ ట్యాగ్ తో ఈ వీడియోను అభిజిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ వీడియో నెటిజన్లకు ఎంతగానో నచ్చింది.

Updated On 11 Sep 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story