బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్ లో మండలం కొల్గూరు లో ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth arrested after post-finale ruckus
బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)ను జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee hills Police) అరెస్టు(arrest) చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్(Gajwel)లో మండలం కొల్గూరు(kollur)లో ప్రశాంత్(Prashanth)తో పాటు అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయనను పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. అనంతరం పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని చంచల్ గుడా జైలుకు తరలించారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం జరిగిన అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పోలీసులు వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమని మరోమారు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
