తెలుగు రియాలిటీ షోలలో బిగ్‌బాస్(Bigg Boss) టాప్‌లో ఉంటుంది. అందుకు కారణం ఆ షోకు ఉన్న ప్రేక్షకాదరణే! ఇప్పటి వరకు ఆరు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ మొదలు కాబోతున్నది. నాలుగు సీజన్ల నుంచి షోను హోస్టింగ్ చేస్తున్న అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్యనే ఆ బిగ్‌బాస్ సీజన్ సెవన్ టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు రియాలిటీ షోలలో బిగ్‌బాస్(Bigg Boss) టాప్‌లో ఉంటుంది. అందుకు కారణం ఆ షోకు ఉన్న ప్రేక్షకాదరణే! ఇప్పటి వరకు ఆరు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ మొదలు కాబోతున్నది. నాలుగు సీజన్ల నుంచి షోను హోస్టింగ్ చేస్తున్న అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్యనే ఆ బిగ్‌బాస్ సీజన్ సెవన్ టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు షో ఇంకా మొదలే కాలేదు కానీ అప్పుడే నాగార్జునకు కోర్టు నోటీసులు(Court Notices) పంపింది. బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లు బాగానే సక్సెస్ అయ్యాయి. తర్వాత టీఆర్‌పీ రేటింగుల కోసం తాపత్రయపడటం మొదయ్యింది. కంటెంట్ తక్కువయ్యింది. విమర్శలు పెరిగాయి. ఈ క్రమంలోనే సీపీఐ(CPI) నాయకుడు నారాయణ(Narayana) అనేకసార్లు బిగ్‌బాస్‌పై కౌంటర్లు వేశారు. ఈ షోను చూడటం వల్ల పిల్లలు, యువత చెడిపోతున్నారని ఆరోపించారు. బిగ్ బాస్‌లోని కంటెస్టెంట్స్ మధ్య అశ్లీలత, అసభ్యత సీన్స్ ఎక్కువయ్యాయని పిటిషన్ కూడా వేశారు. ఈ క్రమంలోనే షోని నిలిపేయాలంటూ హైకోర్టు(High Court) తీర్పు ఇచ్చింది. గతంలో దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాగార్జునతో పాటు సదరు ఛానెల్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. అలాగే ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గతంలోనూ బిగ్‌బాస్ షోపై అనేక విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిటిషన్స్ చాలా దాఖలయ్యాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా బిగ్‌బాస్ షో నడిచింది. మరి ఏడో సీజన్ సాఫీగా నడుస్తుందో లేదో చూడాలి.