తమిళ నటి విచిత్రకు తెలుగు ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురయ్యింది. జీవితాంతం వెంటాడే భయంకరమైన అనుభవం అది! తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ భాషల్లో నటించిన విచిత్రకు ఎక్కడా ఇలాంటిది ఎదురుకాలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన విచిత్ర తర్వాత బుల్లితెరకు షిఫ్ట్‌ అయ్యారు. ఇటీవలే తమిళ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొంటున్నారు.

తమిళ నటి విచిత్రకు తెలుగు ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురయ్యింది. జీవితాంతం వెంటాడే భయంకరమైన అనుభవం అది! తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ భాషల్లో నటించిన విచిత్రకు ఎక్కడా ఇలాంటిది ఎదురుకాలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన విచిత్ర(Vichitra) తర్వాత బుల్లితెరకు షిఫ్ట్‌ అయ్యారు. ఇటీవలే తమిళ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Tamil 7)లో పాల్గొంటున్నారు. 21 ఏళ్లుగా వెండితెరకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో బిగ్‌బాస్‌ షోలో చెప్పారు. నిజంగానే అది షాకింగ్‌ ఇన్సిడెంటే!ఆమె ఏం చెప్పారంటే '2000 సంవత్సరంలో నాకు ఓ సినిమా ఆఫర్‌ వచ్చింది. అది ఓ దివంగత నటుడి (పేరు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు) ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ కేరళ(Kerala)లోని మలంపుళలో జరిగింది. అక్కడే నా భర్త పరిచయం అయ్యాడు. అక్కడే నా జీవితంలోనే అత్యంత దారుణమైన క్యాస్టింగ్‌ కౌచ్‌(Casting Couch) అనుభవాన్ని ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాతే సినిమాలకు స్వస్తి చెప్పానని అందరూ అనుకుంటున్నారు కానీ కారణం అది కాదు. షూటింగ్‌లో నేను పడిన బాధ, అనుభవించిన నరకం కారణంగానే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాను. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను' అని బిగ్‌బాస్‌ షోలో ఉన్న సహచరులతో చెప్పుకొచ్చారు విచిత్ర. 'ఒక తెలుగు హీరోతో పాటుగా నాకు త్రీ స్టార్‌ హోటల్‌లో అకామిడేషన్‌ ఇచ్చారు. ఆ హోటల్‌ జనరల్‌ మేనేజరే తర్వాత నా జీవిత భాగస్వామి అయ్యాడు. ఓ రోజు పార్టీ జరుగుతోంది. అక్కడే ఆ ప్రముఖ నటుడిని కలిశాను. అతడికి నేను ఎవరో తెలియదు. కనీసం నా పేరు కూడా తెలియదు. కానీ డైరెక్ట్‌గా గదిలోకి వచ్చేయమన్నాడు. నేను షాకయ్యాను. అతడి మాటను పట్టించుకోకుండా వెళ్లి నా గదిలో నేను పడుకున్నాను. తర్వాతి రోజు నుంచి షూటింగ్‌లో నన్ను సమస్యలు చుట్టుముట్టాయి. తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. ఆ గండం నుంచి ఎలా బయటపడాలా అని రోజూ భయపడేదానిని. నా గదిలో ఉన్న ఫోన్‌కు ఎవరి నుంచి కాల్స్‌ రాకుండా చూడమని హోటల్‌ సిబ్బందిని వేడుకున్నాను. హోటల్‌ మేనేజర్‌ పరిస్థితి అర్థం చేసుకుని చిత్ర యూనిట్‌కు తెలియకుండా రోజుకో గదికి నన్ను షిఫ్ట్‌ చేశాడు. నేను పాత రూమ్‌లోనే ఉన్నాననుకుని ఆ హీరో తాగి వచ్చి తలుపు తట్టేవాడు. అతడు నాపై పగబట్టాడు. నన్ను క్షోభకు గురిచేయాలని అనుకున్నాడు. ఓ రోజు అడవిలో షూటింగ్‌ జరుగుతుండగా ఎవడో నన్ను తాకరాని చోట తాకాడు. డైరెక్టర్‌ రెండో టేక్‌ తీసుకున్నాడు. మళ్లీ అలాగే నన్ను అసభ్యంగా తాకాడు. మూడో సారి టేక్‌ తీసుకున్నప్పుడు కూడా అలాగే చేశాడు. ఇక నేను భరించలేకపోయాను. అతడి చేయి పట్టుకుని లాగి స్టంట్‌ మాస్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాను. అతడు వాడికి బుద్ది చెప్పడం మానేసి నా చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎవరూ నాకు మద్దతుగా నిలబడలేదు. కోపం, ఆవేశం, బాధ అన్ని చుట్టుముట్టాయి. ఏమీ చేయలేకపోయాను. చెంప మీద దెబ్బ తాలుకు అచ్చులతో యూనియన్ దగ్గరకు వెళితే వారు కూడా జరిగింది మర్చిపోమని సలహా ఇచ్చారు. నీకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని చోట ఎందుకు పని చేస్తున్నావు? అని హోటల్‌ మేనేజర్‌ అన్నాడు. ఆయన నాకోసం కోర్టులో సాక్షిగా నిలబడ్డాడు.. చాలా పోరాడాడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు ముగ్గురు అందమైన పిల్లల్ని ఇచ్చాడు' అని భావోద్వేగానికి లోనయ్యారు విచిత్ర.. ఇంతకీ ఆ తెలుగు హీరో ఎవరై ఉంటాడు? విచిత్ర చేసిన ఒకే ఒక్క తెలుగు సినిమా భలేవాడివి బాసు..మరి విచిత్రను వేధించిన ఆ హీరో ఎవరో ఊహించుకోండి!

Updated On 22 Nov 2023 4:11 AM GMT
Ehatv

Ehatv

Next Story