బిగ్‌బాస్ సీజన్-7(Bigg Boss Season 7) విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను(Pallavi Prashanth) అరెస్ట్(Arrest) చేసిన విషయం తెలిసిందే. కోర్టు ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్(Remand) విధించడంతో అతనిని చంచల్‌గూడ జైలుకు(Chanchalguda Jail) తరలించారు. బిగ్‌బాస్ ఫైనల్ డేన పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టేడియం(Anapurna studio) దగ్గర అల్లర్లకు పాల్పడ్డారని..
బిగ్‌బాస్ సీజన్-7(Bigg Boss Season 7) విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను(Pallavi Prashanth) అరెస్ట్(Arrest) చేసిన విషయం తెలిసిందే. కోర్టు ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్(Remand) విధించడంతో అతనిని చంచల్‌గూడ జైలుకు(Chanchalguda Jail) తరలించారు. బిగ్‌బాస్ ఫైనల్ డేన పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టేడియం(Anapurna studio) దగ్గర అల్లర్లకు పాల్పడ్డారని.. పలువురు సెలబ్రిటీల వాహనాలు, ఆర్టీసీ బస్సుల(RTC Bus) అద్దాలు ధ్వంసం చేశారని పలువురిని అరెస్ట్ చేశారు. అనుమతిలేకుండా ర్యాలీలో పాల్గొని, ప్రజలకు ఇబ్బందులు సృష్టించాడని ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై సినీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివాజీ(Shivaji) స్పందించారు. ప్రశాంత్ చాలా మంచివాడు, రైతు కుటుంబం నుంచి వచ్చాడు. సీజన్ సెవెన్‌లో విన్నర్‌గా నిలవడంతో కొంత ఎక్జయిట్‌మెంట్ అయ్యాడు. బయట తన ఫ్యాన్స్ చేసిన గొడవ గురించి ప్రశాంత్‌కు తెలియదు. గెలిచిన ఆనందం ఒక్కోసారి మనిషిని డామినేట్ చేస్తుంది. దీంతో ఎక్కువగా ఎగ్జయిట్ అయ్యి ర్యాలీలో పాల్గొన్నాడు. చట్టాన్ని గౌరవించి, త్వరలోనే బెయిల్‌పై(Bail) బయటకు వస్తాడని ఆశిస్తున్నా. ప్రశాంత్‌పై చట్టాన్ని అతిక్రమించాడని కేసులు నమోదు చేశారు. తెలియక చేసిన పొరపాటేనని.. అతి త్వరలో బయటకు వస్తాడని శివాజీ ఆకాంక్షించారు.