కబాలి(Kabali) తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి(KP Chowdhary) అలియాస్‌ కేపీ చౌదరి డ్రగ్‌(Drugs) కేసులో చిక్కుకుని అరెస్టయ్యాడు కదా! ఇప్పుడు ఆ కేసులో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్‌బాస్‌ తెలుగు రియాల్టీ షోలో పాల్గొన్న అషూరెడ్డితో(Ashu Reddy) పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న పలువురికి, ప్రముఖులకు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో తాను మొత్తం 12 మందికి డ్రగ్స్‌ అమ్మినట్టు చౌదరి ఒప్పుకున్నాడు.

కబాలి(Kabali) తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి(KP Chowdhary) అలియాస్‌ కేపీ చౌదరి డ్రగ్‌(Drugs) కేసులో చిక్కుకుని అరెస్టయ్యాడు కదా! ఇప్పుడు ఆ కేసులో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్‌బాస్‌ తెలుగు రియాల్టీ షోలో పాల్గొన్న అషూరెడ్డితో(Ashu Reddy) పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న పలువురికి, ప్రముఖులకు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో తాను మొత్తం 12 మందికి డ్రగ్స్‌ అమ్మినట్టు చౌదరి ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్‌, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేశ్ రోషన్‌, నల్లా రతన్‌ రెడ్డి, ఠాగోర్‌ విజ్‌ అలియాస్‌ ఠాగోర్‌ ప్రసాద్‌ మోటూరి, తేజ్‌ చౌదరి అలియాస్‌ రఘు తేజ, వంటేరు శవన్‌ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్‌, నితినేష్‌లు చౌదరి దగ్గర నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేశారట! దీంతో పాటు అషూరెడ్డితో పాటు మరో సీనియర్‌ ఆర్టిస్టుతో కూడా చౌదరి వందల ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.

కొంతమంది నటీమణులతో కేపీ చౌదరి కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు వారంతా జాగ్రత్తపడుతున్నారు. ఆ సీనియర్‌ నటి పేరు బయటకు చెప్పడం లేదు కానీ ఆమె టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. పోలీసులు మాత్రం ఆమె ఎవరనే విషయాన్ని బయట పెట్టడం లేదు. కేవలం అషూరెడ్డి పేరును మాత్రమే పోలీసులు కస్టడీ రిపోర్ట్‌లో పొందుపరిచారు. అషూరెడ్డి పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో(Social media) వైరల్‌ అవుతుండటంతో ఆమె స్పందించారు. డ్రగ్స్‌ కేసులో తనపై వస్తున్న ఆరోపణలలో నిజం లేదన్నారు. మీడియాలో పేర్కొంటున్నట్టు తనకు ఎవరితోనూ డ్రగ్స్‌ సంబంధాలు లేవని చెప్పారు. అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని, సంబంధిత అధికారులకు వాస్తవమేమిటో తెలియచేస్తానని అషూరెడ్డి తెలిపారు. తన ఫోన్‌ నంబర్‌ను అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Updated On 24 Jun 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story