యూట్యూబర్ షన్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై స్టార్ గా, సోషల్ మీడియా సెలబ్రిటీలగా ఫేమస్ అయ్యాడు.

యూట్యూబర్ షన్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై స్టార్ గా, సోషల్ మీడియా సెలబ్రిటీలగా ఫేమస్ అయ్యాడు. అయితే అతను రీసెంట్ గా చాలా చిక్కుల్లో పడ్డాడు. దాంతో అవి అతని కెరీర్ కు ఇబ్బందిగా మారాయి. అయితే రీసెంట్ గా మరోసారి ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు షన్ముఖ్. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ ద్వారా స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ కుర్రాడు ఆతరువాత బిగ్ బాస్ కు వెళ్లి సందడి చేశాడు.
బిగ్ బాస్ విన్నర్ గా గెలవాల్సిన షన్ముఖ్ .. ఆ హౌస్ లో సిరి హనుమంత్ వల్ల వెనకబడ్డాడు. సిరీ హనుమంత్ ఊరికే వెళ్లి అతన్ని హగ్ చేసుకోవడం.. వీరి మధ్య రకరకాల రూమర్లు రావడంతో.. విన్నర్ గా రావాల్సిన అతను రన్నర్ గా నిలవాల్సి వచ్చింది. అంతేకాదు ఈ ప్రభావంతో అతను తన ప్రేమను కూడా కోల్పోయాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత దీప్తి సునయనతో బ్రేకప్, ఆ తర్వాత యాక్సిడెంట్, గంజాయి ఇలా అనే వివాదాల్లో చిక్కుకున్నాడు. చాలా కాలం స్క్రీన్ మీద కనిపించలేదు షన్ముఖ్ జస్వంత్..
కంటెంటె ఏమీ లేకుండా సైలెంట్ అయ్యాడు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తరువాత రీసెంట్ గా మళ్లీ తన న్యూ లైఫ్ ను స్టార్ట్ చేశాడు షన్నూ. రీసెంట్ గా లీలా వినోదం అనే సినిమాతో ఓటీటీ అడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యాడు. ఈసినిమా ఈ టీవీ విన్ లో స్క్రీమింగ్ అవుతుంది. ఇక ఈసిరిస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈకర్ర హీరో.. ఈ సందర్భంగా అతను షాకింగ్ కామెంట్స్ చేశాడు.
షన్ముఖ్ మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన వాటిని గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యాడు. తన జీవితంలో ఎదురైన కష్టాల వల్ల తాను రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.బెంగళూరులో అమృత యూనివర్సిటీలో చదువుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పిచ్చి .. చదవలేకపోతున్నాను, అందుకే ఆరోగ్యం బాగోలేదు అని ఇంట్లో చెప్పేశాడట.
దీంతో వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్ తో యాక్టింగ్ అంటే ఇష్టం అని.. అందుకే ఇలా చెప్పాను అని అన్నాడట. దాంతో డాక్టర్ కూడా షన్నుకు సపోర్ట్ చేస్తూ.. తనకు ప్రెజర్ ఎక్కువగా ఉందని తీసుకెళ్లాలని చెప్పాడట. ఇక ఆ టైమ్ లోనే లైఫ్ లో ఫస్ట్ లవ్ బ్రేకప్.. ఛాన్స్ లు లేక ఇబ్బందులు, రకరకాల కారణాల వల్ల సూసైడ్ చేసుకోవాలి అని ప్రయత్నించాడట షన్ముఖ్.
అంతే కాదు తనమీద వచ్చిన ఆరోపణలలో ఒక వైపు మాత్రమే అందరు చూశారు.. మీడియాలో కూడా అదే వచ్చింది. కాని తాను ఏం తప్పు చేయలేదు. ఆ వర్షన్ ఎవరికి తెలియదు. అది ఎవరు చూపించరు కదా.. అందుకే మరోసారి కూడా సూసైడ్ అట్మెంట్ చేశాను అన్నారు షన్ముఖ్ జస్వంత్. ప్రస్తుతం అతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
