మరోవైపు తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోవడం కోసం షోలోకి వచ్చిన విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), నవీన్‌ పొలిశెట్టి(Naveenpolishetty) కాసేపు సందడి చేశారు. కంటెస్టెంట్‌లను ఉత్సాహ పరిచారు. సీజన్‌-7లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన మొదటి అయిదుగురు కంటెస్టెంట్‌లకు నాగార్జున బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. బ్రీఫ్‌కేసులో 20 లక్షల రూపాయలు పెట్టి, వెళ్లిపోవాలనుకునేవారు ఆ బ్రీఫ్‌కేసును తీసుకుని ఇప్పుడే బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్పారు నాగార్జున. దీనికి ఎవరూ ఓకే చెప్పలేదు. తర్వాత అయిదు లక్షల రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్లారు నాగార్జున. చివరకు 35 లక్షల రూపాయల వరకు వెళ్లారు.

తెలుగులో బాగా పాపులరైన రియాల్టీ షో బిగ్‌బాస్‌(Bigg Boss). విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన బిగ్‌బాస్‌ షో మొదట హిందీలో వచ్చింది. తర్వాత అనేక భాషలలో ఈ రియాలిటీ షో మొదయ్యింది. అన్ని చోట్లా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు విషయానికి వస్తే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ షోను ప్రెజంట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఏడో సీజన్‌ ఆదివారం గ్రాండ్‌గా మొదలయ్యింది. ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా అంటూ ఇన్ని రోజులు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన నాగార్జున(Nagarjuna) మొదట బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి అక్కడి విశేషాలు పంచుకున్నారు. తర్వాత ఈ సీజన్‌లో పాల్గొంటున్న కంటెస్టెంట్‌లను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

మరోవైపు తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోవడం కోసం షోలోకి వచ్చిన విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), నవీన్‌ పొలిశెట్టి(Naveenpolishetty) కాసేపు సందడి చేశారు. కంటెస్టెంట్‌లను ఉత్సాహ పరిచారు. సీజన్‌-7లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన మొదటి అయిదుగురు కంటెస్టెంట్‌లకు నాగార్జున బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. బ్రీఫ్‌కేసులో 20 లక్షల రూపాయలు పెట్టి, వెళ్లిపోవాలనుకునేవారు ఆ బ్రీఫ్‌కేసును తీసుకుని ఇప్పుడే బిగ్‌బాస్‌ నుంచి వెళ్లిపోవచ్చు అని చెప్పారు నాగార్జున. దీనికి ఎవరూ ఓకే చెప్పలేదు. తర్వాత అయిదు లక్షల రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్లారు నాగార్జున. చివరకు 35 లక్షల రూపాయల వరకు వెళ్లారు. నటుడు శివాజీ(Shivaji) కాసింత ఆసక్తి కనబర్చినప్పటికీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.

ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్‌-7 మొదటి ఎపిసోడ్‌తోనే ప్రేక్షకులలో ఆసక్తి పెంచారు నాగార్జున. ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్-7లో పాల్గొంటున్న కంటెస్టెంట్‌లను పరిచయం చేసుకుందాం! వినరా సోదర వీర కుమార, చల్తే చల్తే, ఎవడూ తక్కువ కాదు వంటి సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రియాంక జైన్‌(Priyanka Jain) బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈమె పలు టెలివిజన్‌ సీరియళ్లలో నటిస్తున్నారు. నటుడు శివాజీ(Shivaji) గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటులలో శివాజీ కూడా ఒకరు. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి, మిస్టర్‌ ఎర్రబాబు, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మ, తాజ్‌మహల్‌ వంటి సినిమాలలో హీరోగా నటించారు.

చివరి సారిగా సీసా అనే సినిమాలో శివాజీ నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ ఆ మధ్య గ్యాంగ్‌స్టర్స్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. 2018లో ఆమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సిరీస్‌ విడుదలైంది. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పిల్లగాడ నీతో పాటను, కొండపొలంలో ధమ్‌ ధమ్‌ ధమ్‌ అన్న పాటను పాడి అమితమైన క్రేజ్‌ను సంపాదించుకున్న దామిని భట్ల(Dhamini Bhatla) బిగ్‌బాస్‌లో మెరవబోతున్నారు. ధమ్‌ ధమ్‌ పాట రాసిన చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించిన విషయం తెలిసిందే! ప్రిన్స్‌(Prince) యవార్‌ బాడీ బిల్డర్‌ కమ్‌ మోడల్‌.. చాలా సీరియళ్లలో నటించాడు.

బిగ్‌బాస్‌ షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఓ హిందీ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేసిన శుభశ్రీ(shubha Sri) రాయగురు 2002లో వచ్చిన రుద్రవీణ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఒరిస్సాలో పుట్టి పెరిగిన శుభశ్రీ ఖోఖో, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ పోటీల్లో చురుకుగా పాల్గొనేవారు. కాలేజీ రోజుల్లో మోడలింగ్‌ కూడా చేశారు. వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా 2020 టైటిల్‌ను గెల్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు లాయరుగా పనిచేశారు. ఇక షకీలా(Shakeela) గురించి చెప్పాల్సిందేముంటుంది. ఒకప్పుడు షకీలా క్రేజ్‌ మామూలుగా ఉండేది కాదు. మలయాళ, తెలుగు సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి స్టార్‌ స్టేటస్‌ను అందుకున్నారు.

తాను ఎలా నటిగా మారాల్సి వచ్చిందో? పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో? సంపాదించినదంతా ఎలా పోగొట్టుకున్నారో ఈ సందర్భంగా షకీలా ప్రేక్షకులకు తెలిపారు. కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌(sandeep) బిగ్‌బాస్‌ సీజన్‌-7లో అడుగు పెట్టారు. ఇప్పటికే ఒక రియాల్టీ షోలో విజయం సాధించిన సందీప్‌ ఇప్పుడు బిగ్‌బాస్‌7ను గెలిచేందుకు వచ్చాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కెరీర్‌తో పాటు కుటుంబానికి కూడా తన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. కార్తీక దీపంలో మోనికాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శోభాశెట్టి(Shobha Shetty) కూడా బిగ్‌బాస్‌ 7లో ఎంటరయ్యారు.

కార్తీకదీపంలో తాను నెగెటివ్‌ రోల్‌ పోషించానని, కానీ, బయట చాలా పాజిటివ్‌గా ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు అలాగే, శారీకంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. బయట ఏ పనీ చేయనన్న పేరు తనకు ఉందని, కానీ, బిగ్‌బాస్‌-7లో అన్నీ పనులు చేస్తానని వెల్లడించారు. బుల్లితెర రమ్యకృష్ణ అని అందరూ తనను పిలుస్తుంటారని, దాన్ని నిలబెట్టుకునేందుకు మంచి పాత్రలు పోషిస్తానని అన్నారు. హౌస్‌లో ఎవరైనా శోభాను బ్యూటిఫుల్‌, క్యూట్‌ అని ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం వీకెండ్‌లో అందుకు శిక్ష ఉంటుందని శోభాకు నాగార్జున ట్విస్ట్‌ ఇచ్చారు.

యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టేస్టీ తేజ(Tasty Teja) బిగ్‌బాస్‌-సీజన్‌7లో లక్కును పరీక్షించుకోబోతున్నారు. అన్ని రుచులను చూపిద్దామని హౌస్‌లోకి వచ్చానని ఈ సందర్భంగా తెలిపారు. అమ్మ చేసిన బిర్యానీ అంటే తనకు ఇష్టమని, తాను కూడా వండుతానని అన్నారు. యూట్యూబర్‌గా ఇప్పటివరకూ 150కు పైగా సెలబ్రిటీలతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు.

కథానాయికగా పలు సినిమాల్లో నటించడమే కాదు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రతిక రోజ్‌(Rathika rose) సీజన్‌-7లో ప్రధాన కంటెస్టెంట్‌ కాబోతున్నారు. బిగ్‌బాస్‌ను పెద్దయ్య అని పిలుస్తానని, హౌస్‌లోని కంటెస్టెంట్‌లకు గట్టి పోటీ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. డ్యాన్స్‌ చేయడమే కాదు, ఇతరులను కూడా అనుకరిస్తానని రతిక రోజ్‌ తెలిపారు. డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ(Dr.Gautham Krishna) కూడా బిగ్‌బాస్‌-7లో పాల్గొంటున్నారు. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండిందని, అయితే ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదని గౌతమ్‌ కృష్ణ అన్నారు.

బిగ్‌బాస్‌లోకి 11వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన గౌతమ్‌ తాను డాక్టర్‌ నుంచి యాక్టర్‌గా ఎలా మారానో వివరించారు. ఆకాశ వీధుల్లో అనే చిత్రంలో నటించిన గౌతమ్‌కు నాగార్జున చిన్న టాస్క్‌ ఇచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు సినిమాలలో నటించి మెప్పించారు కిరణ్‌ రాథోడ్‌(Kiran Rathode) బిగ్‌బాస్‌ సీజన్‌-7లో 12వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు. ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే ఉద్దేశంతోనే బిగ్‌బాస్‌కు వచ్చానని అన్నారు. ఫోన్‌, కుక్కలు, ఇంట్లో వాళ్లు లేకుండా ఎప్పుడూ ఉండలేదని, బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చేలోపు తెలుగు నేర్చుకుంటానని చెప్పారు.

నటుడు శివాజీ తెలుగు బాగా నేర్పుతారని, ప్రతివారం పది కొత్త పదాలు అడుగుతానని నాగార్జున అన్నారు.బిగ్‌బాస్‌కు వెళ్తానంటే మొదట అందరూ పరిహాసమాడారని, కానీ పట్టువదలకుండా వీడియోలు చేయడంతో బిగ్‌బాస్‌7లో పాల్గొనే అవకాశం వచ్చిందని అంటున్నారు యూ ట్యూబర్‌, యువరైతు పల్లవి ప్రశాంత్‌. బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లే ముందు ప్రశాంత్‌కు నాగార్జున ఒక మిర్చి మొక్కను ఇచ్చారు.

దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఆ మొక్కకు మిరపకాయలు కాస్తే, కొన్ని బెనిఫిట్స్‌ ఇస్తానని నాగార్జున ఆఫర్‌ ఇచ్చారు. ఎండిపోతే పనిష్‌మెంట్‌ ఉంటుందని హెచ్చరించారు. నటుడు అమర్‌దీప్‌ కూడా బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. గెలవాలనే తపన, కోరిక తనకు ఎక్కువని, నటుడు అమర్‌దీప్‌ అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టిన తాను ప్రతి గేమ్‌లోనూ పట్టువదలకుండా ఆడతానని అన్నారు అమర్‌దీప్‌.

Updated On 4 Sep 2023 4:57 AM GMT
Ehatv

Ehatv

Next Story