✕
ముస్లిం అమ్మాయివి అయి ఉండి పూజలు చేస్తున్నావేమిటి అని ఒకరు ప్రశ్నించారు. దీనికి మాత్రం ఇనయ గట్టిగానే జవాబు ఇచ్చింది. నేను భారతదేశంలో ఉన్నానని, ఇక్కడ నాకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ ఉందని, మధ్యలో నీకు ఏమిటి సమస్య అని నిలదీసింది..

x
Bigg Boss Inaya
-
- ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy)మళ్లీ వార్తలలో వచ్చారు. ఈసారి బిగ్‌బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా(Inaya Sultana)కు పూజలు చేయించారు. ఆమె కెరీర్ బ్రహ్మండంగా ఉండాలని ఆశీస్సులు అందించారు. సినిమాల మీద మక్కువతో కన్నవారిని, ఇంటిని వదిలేసి హైదరాబాద్‌కు వచ్చిన ఇనయకు ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో యాంకర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆమెకు అప్పుడంతా నేము ఫేము రాలేదు కానీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(ram gopal varma)ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక్కసారిగా పాపులరయ్యింది.
-
- ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్(bigboss)లో అడుగుపెట్టింది. బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేసిన చాలా మందికి ఆఫర్లు వచ్చాయి. ఇనయా సుల్తాన కూడా అలాగే అనుకుంది. మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే అయ్యింది ఆమె పరిస్థితి. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎలాగైతే ఆఫీసుల చుట్టూతా తిరిగిందో ఇప్పుడూ అలానే తిరుగుతోంది. అందుకే వేణుస్వామిని కలిసింది.
-
- ప్రత్యేక పూజలు చేయించుకుంది. మెడలో పూలమాల వేసుకుని ఉన్న ఇనయపై వేణుస్వామి కలశంతో నీళ్లు చల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇనయ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు తలో తీరుగా స్పందిస్తున్నారు. పూజలు చేయగానే ఫేమస్ అయిపోతాననిఅనుకుటున్నావా? హీరోయిన్ అవకాశాలు వస్తాయని భావిస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముస్లిం అమ్మాయివి అయి ఉండి పూజలు చేస్తున్నావేమిటి అని ఒకరు ప్రశ్నించారు. దీనికి మాత్రం ఇనయ గట్టిగానే జవాబు ఇచ్చింది. నేను భారతదేశంలో ఉన్నానని, ఇక్కడ నాకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ ఉందని, మధ్యలో నీకు ఏమిటి సమస్య అని నిలదీసింది..

Ehatv
Next Story