హరితేజ (hariteja) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! ఎందుకంటే బుల్లితెర పై ఎంత పాపులరో, వెండితెరపై కూడా అంతే పాపులరయ్యారు ఈ నటి. పైగా యాంకర్(anchor)కూడా! ఆన్‌స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌పై కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. సినిమాల్లో తన యాక్టింగ్‌తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తారు.
హరితేజ (hariteja) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! ఎందుకంటే బుల్లితెర పై ఎంత పాపులరో, వెండితెరపై కూడా అంతే పాపులరయ్యారు ఈ నటి. పైగా యాంకర్(anchor)కూడా! ఆన్‌స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌పై కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. సినిమాల్లో తన యాక్టింగ్‌తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తారు. అంతేకాదు సటైరికల్ కామెంట్స్‌తో అలరిస్తారు. తెలుగువారి అభిమాన నటి సూర్యకాంతంలా(Suryakantham) పేరు సంపాదించుకున్నారంటూ త్రవిక్రమ్(Trivikram) కితాబు కూడా ఇచ్చారు. ఆమెకు తన దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు.
ఆమె బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్‌గా నిలిచారు! కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో హరితేజ పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో భూమి అనే కూతురు కూడా పుట్టింది. పాప పుట్టిన తర్వాత హరితేజ కాస్త లావయ్యారు. అయితే చాలా శ్రమించి బరువు తగ్గడమే కాకుండా చాలా స్లిమ్‌గా తయారయ్యారు. ప్రస్తుతం హరితేజ ఆస్ట్రేలియాలో ఉన్నారు. వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కూతురును తల్లి దగ్గర వదిలిపెట్టి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చాన్నాళ్ల తర్వాత ఫ్యాన్స్‌తో చిట్ చాట్ సెషన్ ప్రారంభించారు హరితేజ. ఇందులో ఓ నెటిజన్ ఓ ప్రశ్న వేశాడు. మీ భర్త దీపక్‌తో(Deepak) విడాకులు తీసుకున్నారా? అని అడిగాడు. దానికి హరితేజ కోపగించుకోకుండా చాలా నవ్వుతూ తనదైన శైలిలో జవాబిచ్చారు. నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్త దీపక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. అలా విడాకుల(Divorce) వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో నెటిజన్ బుల్లితెర సీరియల్ నటి నవ్యతో విడిపోయారా..? అని అడిగారు. దానికి హరితేజ చక్కటి జవాబిచ్చారు. 'అలా ఎన్నటికి అవదమ్మా.. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా బలమైనది' అని చెప్పారు. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన హరితేజ తనకు నప్పే ఓ మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు.