లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న‌ హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది

లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న‌ హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. సోహైల్ తల్లి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోహైల్ స్వ‌స్థ‌లం కరీంనగర్. సోహైల్.. తండ్రి సయ్యద్ సలీం, తల్లి ఫైమా సుల్తానా, తమ్ముడు సయ్యద్ నబీల్‌తో క‌లిసి ఉంటున్నాడు.

అయితే.. సోహైల్ తల్లి ఫైమా సుల్తానా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. డయాలసిస్ నిమిత్తం మెడికవర్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఆమె.. పరిస్థితి విషమించడంతో మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సోహైల్ కుటుంబంలో విషాదం నెల‌కొంది.

‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్.. ‘బిగ్ బాస్-4’ ద్వారా క్రేజ్ సంపాదించుకున్నాడు. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం కరీంనగర్ తరలించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story