టెలివిజన్‌లో బాగా పాపులర్‌ అయిన షో ఏదైనా ఉందంటే అది బిగ్‌ బాసే(Bigg Boss)! హిందీతో పాటు అనేక భాషల్లో ఈ రియాలిటీ షో టెలికాస్ట్‌ అవుతోంది. బిగ్‌బాస్‌ ద్వారా నేమ్‌ను ఫేమ్‌ను సంపాదించుకున్న వారు చాలా మందే ఉన్నారు. కొందరు స్టార్లు కూడా అయ్యారు. అలాంటి వారిలో నటి ఓవియా(Oviya) ఒకరు. మలయాళీ భామ ఓవియా తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో అలరించారు. ఓవియాకు దక్కిన పాపులారిటీ తమిళంలో మరే బిగ్‌బాస్ స్టార్‌కి దక్కలేదన్నది వాస్తవం. అప్పట్లో ఓవియా కోసం చాలా ఆర్మీ గ్రూపులు ఏర్పడ్డాయి. బిగ్‌బాస్‌ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వెతుక్కంటూ వచ్చాయి.

టెలివిజన్‌లో బాగా పాపులర్‌ అయిన షో ఏదైనా ఉందంటే అది బిగ్‌ బాసే(Bigg Boss)! హిందీతో పాటు అనేక భాషల్లో ఈ రియాలిటీ షో టెలికాస్ట్‌ అవుతోంది. బిగ్‌బాస్‌ ద్వారా నేమ్‌ను ఫేమ్‌ను సంపాదించుకున్న వారు చాలా మందే ఉన్నారు. కొందరు స్టార్లు కూడా అయ్యారు. అలాంటి వారిలో నటి ఓవియా(Oviya) ఒకరు. మలయాళీ భామ ఓవియా తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో అలరించారు. ఓవియాకు దక్కిన పాపులారిటీ తమిళంలో మరే బిగ్‌బాస్ స్టార్‌కి దక్కలేదన్నది వాస్తవం. అప్పట్లో ఓవియా కోసం చాలా ఆర్మీ గ్రూపులు ఏర్పడ్డాయి. బిగ్‌బాస్‌ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వెతుక్కంటూ వచ్చాయి. తమిళ, మలయాళంలో అనేక సినిమాల్లో నటించారు. ఇప్పటికే పాతిక సినిమాలకు పైగా నటించిన ఈ అందాలభామ తెలుగులో ఇది నా లవ్‌ స్టోరీ(Idhi Na Love story) అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. బిగ్‌బాస్‌ షోలో ఓవియా ఆత్మహత్యాయత్నం(sucide) చేశారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. బిగ్‌బాస్‌ షోలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

ఈ ఇన్సిడెంట్‌తో ఓవియా తమిళంలో సంచలనంగా మారిపోయారు. ప్రస్తుతం ఆమె చూయిగం(Chewing Gum) అనే వెబ్‌ సిరీస్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓవియా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పెళ్లి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓవియా పెళ్లిపై చాలా వదంతులు వచ్చాయి. ఓవియా లెస్బియన్(Lesibian) కాబట్టి పెళ్లి చేసుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. దీన్ని ఓవియా ఖండించారు. 'నేను లెస్బియన్‌ని కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్‌ ఏమీ లేవు. అంతే కాకుండా ఇప్పుడు పెళ్లి గురించి నేను ఆలోచించడం లేదు. ఇప్పుడే కాదు, నా జీవితంలో ఇలాంటివి జరుగుతాయో లేదో కూడా తెలియదు. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి అని నేనెప్పుడూ భావించలేదు. అందరూ అనుకుంటున్నట్లు నేను ఏ బిడ్డకు జన్మనివ్వలేదు. నేను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను. పెళ్లయ్యాక బిడ్డను కనాలనే ఆలోచన కూడా నాకు లేదు. పెళ్లయ్యాక ఒత్తిడిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. నేను అలా ఉండాలనుకోను. నేను నా కోసమే జీవిస్తున్నాను' అని చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పేశారు ఓవియా

Updated On 30 Aug 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story