వెస్ట్రన్‌ కంట్రీస్‌(Western countries) నుంచి దిగుమతి అయిన బిగ్‌బాస్‌ రియాల్టీ షో(Bigg Boss Reality show) హిందీలోకి వచ్చింది

వెస్ట్రన్‌ కంట్రీస్‌(Western countries) నుంచి దిగుమతి అయిన బిగ్‌బాస్‌ రియాల్టీ షో(Bigg Boss Reality show) హిందీలోకి వచ్చింది. అక్కడ హిట్టయ్యాక తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, మలయాళ భాషలలో వచ్చేసింది. తెలుగులో కూడా నాలుగైదు సీజన్లు సూపర్‌హిట్టయ్యాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చి పాపులరైన వారు కూడా ఉన్నారు. కరోనా తర్వాత బిగ్‌బాస్‌ ఓటీటీల షోలు కూడా ప్రసారమవుతున్నాయి. పరిచయం లేని కొందరిని ఒకే హౌస్‌లో ఉంచి వారికి రకరకాల టాస్కులు, గేమ్స్‌ పెడతారు. ఈ క్రమంలోనే వారి మధ్య తగవులు పెడతారు. దాదాపు వంద రోజుల పాటు ఈ రియాల్టీ షో సాగుతుంది. ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 సాగుతోంది. ఇందులో పార్టిసిపేట్‌ చేస్తున్నవారు పేరున్నవారే! అంటే సెలబ్రెటీలే! లేటెస్ట్‌గా ఈ హౌజ్‌లో జరిగిన ఘటన అందరినీ షాక్‌లోకి నెట్టేసింది. ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ హౌస్‌లో(Bigg boss House) సెక్స్‌(Intimacy) చేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యూ ట్యూబర్‌ అర్మాన్‌ మాలిక్‌(arman malik) తన ఇద్దరు భార్యలు పాయల్‌ మాలిక్‌(Payal Malik), కృతికలతో(Krithika) హౌస్‌లోకి ఎంటరయ్యాడు. ఇతగాడు తన ఇద్దరు భార్యలతో టిక్‌టాక్‌లు చేస్తూ పాపులరయ్యాడు. అసలు బిగ్‌బాస్‌ షోలోకి ఇద్దరు భార్యలతో రానివ్వడమే తప్పిదం. అయినా నిర్వాహకులు విమర్శలను పట్టించుకోలేదు. కొద్ది రోజుల్లోనే పాయల్ మాలిక్ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం అర్మాన్, కృతికా షోలో ఉన్నారు. వీరిద్దరు షోలో మితిమీరిన రొమాన్స్ చేస్తూ విమర్శలపాలవుతున్నారు. తాజాగా అర్మాన్, కృతిక ఒకే బెడ్ మీద పడుకొని లైంగిక కార్యక్రమాలకు పాల్పడటం కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ దృశ్యాలు బయటకు రావడంతో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ షోపై చాలా మందికి అదో రకమైన అభిప్రాయం ఉంది. ఈ ఇన్సిడెంట్‌తో అది మరింత పెరిగింది. బిగ్ బాస్ షో నిర్వాహకులు దిగజారుడుతనానికి ఇది పరాకాష్ట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లతో కలిసి ఈ షోను ఎలా చూస్తారని ప్రేక్షకులు నిలదీస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు నోరు విప్పలేదు. విప్పుతారన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు.

Eha Tv

Eha Tv

Next Story