బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ ను 'రైతు బిడ్డ' పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే చివర్లో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్‌లను హోస్ట్ నాగార్జున స్టేజిపైకి తీసుకువచ్చారు.

Bigg Boss 7 Telugu Season Winner Pallavi Prashanth
బిగ్ బాస్ సీజన్-7 టైటిల్(Bigg Boss Season-7) ను 'రైతు బిడ్డ' పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) కైవసం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే(Grand Finale) చివర్లో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్(Amardeep)లను హోస్ట్ నాగార్జున(Nagarjuna) స్టేజిపైకి తీసుకువచ్చారు. అనంతరం.. విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించారు. దీంతో రెండవ ఫైనలిస్ట్ అమర్ దీప్ రన్నరప్(Runnerup)గా మిగిలాడు.విన్నర్ పల్లవి ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్ మనీ, మారుతి సుజుకి బ్రెజా కారు, జోయాలుక్కాస్ నుంచి రూ.15 లక్షల గిఫ్ట్ వోచర్ అందుకున్నాడు.
టైటిల్ గెలిచిన అనంతరం పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. తాను ముందు చెప్పినట్టుగా తాను గెలిచిన ప్రైజ్ మనీ(Prize Money)లో ప్రతి పైసా కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని వేదిక పైనుంచి ప్రకటించాడు. ఇక కారును తన తండ్రికి ఇస్తానని.. తల్లికి నెక్లెస్ ఇస్తానని తెలిపాడు.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న అమర్ దీప్ మాట్లాడుతూ.. నాకేం కాదు.. నాకు మీరున్నారు.. నిజంగానే నేను అనుకోలేదు.. ఇక్కడ వరకూ వస్తానని.. నన్ను ఇక్కడ వరకూ తెచ్చింది మీరేనని.. కప్పు గెలవలేదని అస్సలు ఫీల్ కావడం లేదు.. మీ అందర్నీ గెలిచాను.. మీరంతా నాతో ఉన్నారు.. ఇంతకంటే నాకేం కావాలి.? ఇది చాలు అంటూ ఉద్వేగభరితమయ్యాడు.
