బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అంతా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇవ్వడమే ఆలస్యం గెలవాలనే పట్టుదల వారిలో కనిపిస్తోంది. అయిదు వారాల ఇమ్యూనిటీ పవర్‌ ఇస్తానని బిగ్‌బాస్‌ ఆశపెట్టగానే అందరూ అలర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో కొందరు బాగానే చేశారు కానీ మరికొందరు కాసింత ఓవరాక్షన్‌ చేశారు. నిన్నటి వరకు అల్లరి చేసిన రతిక(Rithika) మాజీ లవర్‌ను(Ex-Boyfriend) తల్చుకుని ఏడ్చేసింది.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss 7) ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అంతా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇవ్వడమే ఆలస్యం గెలవాలనే పట్టుదల వారిలో కనిపిస్తోంది. అయిదు వారాల ఇమ్యూనిటీ పవర్‌ ఇస్తానని బిగ్‌బాస్‌ ఆశపెట్టగానే అందరూ అలర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో కొందరు బాగానే చేశారు కానీ మరికొందరు కాసింత ఓవరాక్షన్‌ చేశారు. నిన్నటి వరకు అల్లరి చేసిన రతిక(Rithika) మాజీ లవర్‌ను(Ex-Boyfriend) తల్చుకుని ఏడ్చేసింది.

తనను ఇంప్రెస్‌ చేసిన వారికి ఇమ్యూనిటీ టాస్క్‌ బరిలో నిలిచే ఛాన్స్‌ ఇస్తానని బిగ్‌బాస్‌ చెప్పగానే అమర్‌దీప్‌(Amardeep) అదుల్స్‌ సినిమాలో ఎన్టీఆర్‌ చారి పాత్రలో, రతిక బ్రహ్మనందం పాత్రలో ఇమిడిపోయారు. ప్రిన్స్‌ యావర్‌(Prince Yavar) అమ్మాయి వేషంలో హౌస్‌ అంతా తిరిగాడు. శివాజీ(Shivaji) మాత్రం తనలో ఉన్న ఫస్ట్రేషన్‌ను తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకుని బిగ్‌బాస్‌ను చెడామడా తిట్టేశారు. కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్‌ మాత్రమే అని చెప్పాడు. తన కాఫీ కావాలని మొన్నటి నుంచే అడుగుతున్నాడు శివాజీ. ఇప్పుడు మంచి ఛాన్స్‌ దొరకడంతో యాక్టింగ్‌ పేరుతో బిగ్‌బాస్‌ను తెగ తిట్టేశాడు.

అడ్డుపడినవారిని కూడా తిట్టాడు. గౌతమ్‌ను శివాజీ బీపీ చెక్‌ చేయమని, రతికను స్టెతస్కోప్‌తో అందరి గుండె ఏమి చెబుతుందో తెలుసుకోవాలనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. శివాజీ మరోసారి అతి చేశాడు. గౌతమ్‌, రతికలను అడ్డుకున్నాడు. శివాజీ చేస్తున్న ఓవరాక్షన్‌ను బిగ్‌బాస్‌ కూడా భరించలేకపోయాడు. అతడిని కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి కాఫీ ఇచ్చి కాసేపు నోరుమూసుకునేట్టు చేశాడు. శుభశ్రీ ఏ పిల్లగాడా అంటూ పాటపాడుతూ డాన్స్‌ చేసింది. అది కూడా పరికిణలో! ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్‌బాస్‌ రతికను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు అని అడిగాడు. దానికి రతిక మెలికలు తిరిగిపోయింది. 'నాకు నచ్చాలంటే అమాయకంగా ఉండాలి, సంగీతంపై అవగాహన ఉండాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే నా మాజీ లవర్‌లా ఉండాలి' అని జవాబిచ్చింది. ఎవరినైనా మిస్‌ అవుతున్నావా? అని బిగ్‌బాస్‌ మరో ప్రశ్న వేశాడు. దానికి రతిక కన్నీళ్లు పెట్ఉకుంది. 'మిస్‌ అవుతున్నావా? అని అడిగితే ఎవరైనా పేరెంట్స్‌ పేరు చెప్తారు. కానీ వాళ్లు దగ్గరున్నా కూడా ఇంకెవరినైనా మిస్‌ అవుతామా? అంటే అది ఆ వ్యక్తే! మిస్సింగ్‌ ఫీలింగ్‌ అనగానే అతడే గుర్తొచ్చాడు. కొన్ని ఏళ్ల నుంచి మిస్‌ అవుతున్నాను. ఈ టాపిక్‌ లేవనెత్తగానే నేను చాలా డిస్టర్బ్‌ అవుతున్నాను. ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూస్తున్నాను' అని రతిక చెప్పింది.

రతికను మంచి మూడ్‌లోకి తెచ్చేందుకు బిగ్‌బాస్‌ ప్రయత్నించాడు. ఇప్పటివరకు నువ్వు ఎన్నో పాటలు పాడావు కదా.. నీకోసం ఓ పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా ఊచ్‌ అని పాట ప్లే చేశాడు. తర్వాత షకీలాను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు. గాసిప్స్‌తో పాటు కొన్ని ముచ్చట్లు చెప్పాలన్నాడు. దీనికి 'ప్రశాంత్‌ స్ట్రాంగ్‌, కాకపోతే ఫేక్‌ అనిపిస్తుంది. ప్రశాంత్‌ను రతిక ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తుంది. గౌతమ్‌-శుభ్రీ రాత్రంతా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్ని బంధాలు బూటకమే' అని తెలిపింది. టేస్టీ తేజ షో ప్రారంభంలో నాగార్జున ఇచ్చిన బ్యాడ్జ్‌లను తాజా ఎపిసోడ్‌లో పంచాడు. పెరుగన్నం బ్యాడ్జ్‌ శుభశ్రీకి ఇచ్చాడు.

ఇందుకోసం ఆమె 20 సెకన్లపాటు తేజను ఎత్తుకుంది. మిర్చి బ్యాడ్జ్‌కు గానూ శోభాశెట్టి తేజతో రొమాంటిక్‌ డ్యాన్స్‌ చేసింది. బర్గర్‌ బ్యాడ్జ్‌ను రతికకు ఇచ్చాడు. తన గురించి ఏదైనా పాట రూపంలో చెప్పాలన్నాడు. తేజను కూడా కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ హౌస్‌లో సాగుతున్న సంగతులు చెప్పాలన్నాడు.
'శోభాకు కనెక్ట్‌ అవుతున్నాడని గౌతమే నాతో స్వయంగా చెప్పాడు. డాక్టర్‌బాబు- మోనితల గురించి హౌస్‌లోనూ మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్‌ను ఫేక్‌ అని చెప్పలేను, కానీ.. కావాలని కింద కూర్చుంటూ, కింద పడుకున్నాడేమో అనిపిస్తోంది' అని తేజ తెలిపాడు. అయితే తనను ఇంప్రెస్‌ చేసిన కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ చెప్పలేదు. ఎవరయ్యి ఉంటారో ఏమో!

Updated On 8 Sep 2023 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story