బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) మొదలై వారం దాటిపోయింది. రియాల్టీ షో ప్రారంభమైనప్పుడు హోస్ట్‌ నాగార్జున(Nagarjuna) ఉల్టా పల్టా అని తెగ హడావుడి చేశారు. అయితే మొదటి వారం పెద్దగా షోలో డిఫరెన్స్‌ కనిపించలేదు. ఈ సీజన్‌ కూడా లాస్ట్‌ సీజన్‌లాగే మామూలుగా ఉంటుందా అన్న సందేహం కలిగింది.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌(Bigg Boss Season 7) మొదలై వారం దాటిపోయింది. రియాల్టీ షో ప్రారంభమైనప్పుడు హోస్ట్‌ నాగార్జున(Nagarjuna) ఉల్టా పల్టా అని తెగ హడావుడి చేశారు. అయితే మొదటి వారం పెద్దగా షోలో డిఫరెన్స్‌ కనిపించలేదు. ఈ సీజన్‌ కూడా లాస్ట్‌ సీజన్‌లాగే మామూలుగా ఉంటుందా అన్న సందేహం కలిగింది. సోమవారం నుంచి బిగ్‌బాస్‌ షోలో ఉత్కంఠ వచ్చేసింది. శివాజీ(shivaji), ప్రశాంత్‌ను(Prashanth) మిగతా కంటెస్టెంట్లందరూ ఉతికి ఆరేశారు. ఏడో సీజన్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి కంటెస్టెంట్‌ కిరణ్‌ రాథోడ్‌(Kiran Rathore). ఆమె వెళ్లిపోవడం శుభశ్రీకి బాధ అనిపించింది. ఇద్దరం చక్కగా ముచ్చట్లు చెప్పుకున్నామని, జోకులు వేసుకున్నామని అలాంటి కిరణ్‌ రాథోడ్‌ వెళ్లిపోవడం చాలా బాధ అనిపించిందని శుభశ్రీ(Shunha Shri) చెప్పారు.

కొద్ది సేపటి తర్వాత బిగ్‌బాస్‌ అందరూ బెడ్‌రూమ్‌లోకి పడుకోవాలని ఆదేశించాడు. దీని తర్వాత రతిక వచ్చి గొడవ పెట్టుకున్నారు. సందీప్‌ నువ్వు వీఐపీ గదిలోకి వచ్చినవారిని అడగవా అని అతడిని రెచ్చగొట్టారు. వీఐపీ గదిలో రతిక తమను అంటున్నారేమో అనుకున్న ప్రియాంక-శోభాశెట్టి అదే గదిలో నేలపై పడుకున్నారు. రతిక మాత్రం బెడ్‌పైనే రాత్రంతా పడుకున్నారు. మరోవైపు బాత్‌రూమ్‌ కడిగే విషయంలో శోభాశెట్టికి(Shobha shetty) సహాయం చేస్తున్న టేస్టీ తేజ ఇప్పుడు కగడమని బిగ్‌బాస్‌ ఏం చెప్పలేదు కదా అని ఆమెతోనే గొడవపడ్డారు.

ఈ వారం నామినేషన్‌లో భాగంగా ఓ బాక్స్‌లాంటిది ఉంటుందని, బిగ్‌బాస్‌ పిలిచిన వాళ్లు అందులో వెళ్లి నిలబడాలని బిగ్‌బాస్‌ చెప్పారు. ఎవరినైతే నామినేట్‌ చేయాలనుకుంటున్నారో కచ్చితమైన కారణాలు చెప్పాలని ఆదేశించారు. నామినేట్‌ అయిన కంటెస్టెంట్‌పై పై నుంచి రంగు నీళ్లు పడుతుందని చెప్పారు. పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్.. ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చని చెప్పగా.. ప్రిన్స్ పేరు చెప్పాడాయన. అయితే తనని కావాలని టార్గెట్ చేస్తున్నారని ప్రిన్స్ అనడంతో.. ప్రిన్స్-సందీప్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ప్రిన్స్ డైరైక్ట్ నామినేషన్ అయినందున అతడిని మరెవరు నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు.
ప్రిన్స్ తర్వాత వచ్చిన తేజని శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు. అనంతరం దామిని వస్తే.. ఆమెని ఎవరూ నామినేట్ చేయలేదు.

తర్వాత శివాజీ రాగా.. ఇతడిని అమర్‌దీప్, ప్రియాంక, షకీలా, శోభాశెట్టి, దామిని.. ఇలా ఏకంగా ఐదుగురు నామినేట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళ రీజన్స్ చెప్పుకొచ్చారు. అమర్‌దీప్ మాట్లాడుతూ ప్రశాంత్‌ను అస్తమానం పొగుడుతూ తమని తక్కువ చేసేలా శివాజీ మాట్లాడుతున్నారని అన్నాడు. అలానే తాము చెప్పేది శివాజీ అస్సలు వినిపించుకోవడం లేదని ప్రియాంక, శోభాశెట్టి కారణాలు చెప్పారు. అలానే శివాజీ తీరుతో ప్రియాంక.. బయటకొచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రశాంత్‌ను గౌతమ్‌, అమర్‌దీప్‌, షకీలా, తేజ, దామిని, ప్రియాంకలు నామినేట్‌ చేశారు. మొదటివారం రతికతో కలిసి పిచ్చాపాటి మాట్లాడిన ప్రశాంత్‌ను నామినేట్‌ చేసేసరికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు.

ప్రియాంక, అమర్‌దీప్‌తో చాలా సేపు వాదించాడు. అయితే ప్రశాంత్‌ను నామినేట్‌ చేసిన వారి వాదన మరో రకంగా ఉంది. ప్రశాంత్‌ సెంటిమెంట్‌ పేరు చెప్పి కెమెరాలను ముందు నటిస్తాడని అన్నారు. బిగ్‌బాస్‌లో అవకాశం కోసం స్టూడియో చుట్టూ కుక్కలా తిరగానని ప్రశాంత్‌ అన్నదానికి రతిక గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్‌ చేస్తున్న సమయంలో అమర్‌దీప్ చెప్పిన పాయింట్స్‌కు కంటెస్టెంట్స్‌ మాత్రమే కాదు, ప్రేక్షకులకు కూడా మద్దతు ఇచ్చారు.రైతు బిడ్డ అని ఊరికే చెప్పడం కరెక్ట్ కాదని, గౌతమ్ కృష్ణ.. ప్రశాంత్‌తో వాదించారు.ఈ మొత్తం వ్యవహారంలో శివాజీ, ప్రశాంత్ మాత్రం తాము మాత్రమే గొప్పవాళ్లమన్నట్టుగా ప్రవర్తించారు. ఈ విధంగా సోమవారం షో ముగిసింది.

Updated On 12 Sep 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story