పబ్లిక్ న్యూసెన్స్‌ను సృష్టించిన బిగ్‌బాస్(Big Boss) సీజన్ -7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో(Switch off) ఉండటంతో అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్-7 టైటిల్‌ను గెల్చుకున్నాడు. అమర్‌దీప్(Amardeep) రన్నరప్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పబ్లిక్ న్యూసెన్స్‌ను సృష్టించిన బిగ్‌బాస్(Big Boss) సీజన్ -7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో(Switch off) ఉండటంతో అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్-7 టైటిల్‌ను గెల్చుకున్నాడు. అమర్‌దీప్(Amardeep) రన్నరప్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్‌దీప్‌ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. ఇదే సమయంలో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) ఫాన్స్ కూడా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్‌దీప్ కారును ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగాయి. అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసుల సాయంతో రహస్యమార్గం గుండా బయటకు వంపింది. మళ్లీ ఇటు రావొద్దంటూ చెప్పింది. అయితే పల్లవి ప్రశాంత్ పోలీసుల(Police) ఆదేశాలను బేఖాతరు చేశాడు. గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్‌లో వచ్చాడు. దాంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. మహిళా కంటెస్టెంట్లపై దాడికి దిగారు. నానా బీభత్సం సృష్టించారు. ఇంత విధ్వంసానికి కారకుడైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీ హిల్స్(Jubliee Hills) పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు(Parashuramulu) కోసం పోలీసులు అతడి ఊరుకు వెళ్లారు. కారు డ్రైవర్ సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువ్విన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను(CCTV) పరిశీలిస్తున్నారు.