కొంత మందికి లక్కు నక్క తోక తొక్కకపోయినా వెంబడిస్తుంటుంది. మరికొంత మందికి కాస్త లేట్ అయినా..లక్కు కలిసి వస్తుంది. బిగ్ బాస్(Big boss) బ్యూటీ ఇనయకకు సరిగ్గా అదే జరిగింది. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది

కొంత మందికి లక్కు నక్క తోక తొక్కకపోయినా వెంబడిస్తుంటుంది. మరికొంత మందికి కాస్త లేట్ అయినా..లక్కు కలిసి వస్తుంది. బిగ్ బాస్(Big boss) బ్యూటీ ఇనయకకు సరిగ్గా అదే జరిగింది. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది

ఇనయ సుల్తానా.. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది బ్యూటీ.. కాని ఎవరికీ పెద్దగా తెలియదు. కాని ఎప్పుడైతే ఆమె బిగ్ బాస్ లోకి వచ్చిందో... హౌస్ లో మొదటి రోజు నుంచే పాపులర్ అయ్యింది. గయ్యాలి గంప అన్నపేరు సాధించింది. గట్టిగా అరవడంతో.. మాటలతో దాడి చేయడంలో ఆమెను మించినవారులేదు.

బిగ్ బాస్ లోకి ఆమె రావడంలోనే విచిత్రమైన కథ ఉంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి ఈ భామ ఒక డాన్స్ చేయగా అది కాస్త బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో తెచ్చిన ఫేమ్ తో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. బిగ్ బాస్ తో మరింత ఫేమస్ అయ్యింది ఇనయ.

అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లో .. గొడవలు, సెంటిమెంట్.. రఫ్ అండ్ టఫ్ గేమ్స్ ఏవైనా.. ఇనయన తరువాతే.. అలా బిగ్ బాస్ హౌస్ లో గట్టిగా గుర్తింపు పొందిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చాక కూడా అంతే పాపులర్ అయ్యింది. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఇఫ్పుడు హీరోయిన్ గా నటించబోతుంది బ్యూటీ.

ఇక తాజాగా ఇనయా సుల్తానా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోందతి. బిగ్‌బాస్ లో తన అట తీరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకుంది బ్యూటీ. ఇక హీరోయిన్ గా వెండితెరపై వెలగబోతోంది. నటరత్నాలు అనే సినిమాలో ఇనయా హీరోయిన్ గా నటించబోతున్నట్టుతెలుస్తోంది.

నటరత్నాలు అనే సినిమాలో ఇనయ హీరోయిన్ గా కనిపించబోతుంది ఇనయ సుల్తానా. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నర్రా శివనాగు(Narra Shivanagu) డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పిస్తుండగా.. చందన ప్రొడక్షన్స్‌ పతాకంపై డా దివ్య నిర్మిస్తుంది.

ఇనయా సుల్తానాతో పాటు ఈసినిమాలో రంగస్థలం మహేష్‌(Mahesh), సుదర్శన్‌, అర్జున్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తామన్నారు మేకర్స్.

Updated On 18 April 2023 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story