మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన భోళాశంకర్ సినిమా (Bhola Shankar) బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిన్నది. మొదటి షో నుంచే సోషల్ మీడియాతో ఈ సినిమాపై ట్రోల్స్ రావడం మొదలయ్యింది. నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara)పై అసత్య కథనాలు వండి వార్చారు కొందరు నెటిజన్లు. దీనిపై అనిల్ సుంకర ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన భోళాశంకర్ సినిమా (Bhola Shankar) బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిన్నది. మొదటి షో నుంచే సోషల్ మీడియాతో ఈ సినిమాపై ట్రోల్స్ రావడం మొదలయ్యింది. నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara)పై అసత్య కథనాలు వండి వార్చారు కొందరు నెటిజన్లు. దీనిపై అనిల్ సుంకర ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు కొంతమందికి క్రూరమైన వినోదాన్ని పంచవచ్చేమో కానీ అనుక్షణం కష్టపడి పైకి వచ్చిన వారి ప్రతిష్టను దెబ్బ తీయడం నిజంగా నేరమేనని చెప్పారు.
భోళాశంకర్ పరాజయం పాలు కావడంతో సోసల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పారితోషికం విషయంలో చిరంజీవి పట్టుబట్టడంతో నిర్మాత అనిల్ సుంకర్ ఇల్లు, తోటలను అమ్మాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు తెగ వైరల్ అయ్యాయి. వీటిపై ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ రియాక్టయ్యింది. ఇప్పుడు అనిల్ సుంకర కూడా స్పందించారు. 'వదంతులు కొంత మంది వ్యక్తులకు క్రూరమైన వినోదాన్ని పంచవచ్చు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి వార్తల వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను గురవుతున్నాయి. నాకూ చిరంజీవిగారికి మధ్య వివాదం నెలకొందని వచ్చిన వార్తల్లో కొంచెం కూడా నిజం కూడా లేదు. ఆయన అన్ని విధాల సహకారం అందించే వ్యక్తి. సినిమాల పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నిజాలు కప్పిపెట్టి, విద్వేషపూరిత వార్తలను దయచేసి వ్యాప్తి చేయకండి. ఫేక్ న్యూస్ సృష్టించడం కొందరికి సరదా. కానీ, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పరిశ్రమకు చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో మరింత బలంగా తిరిగి మీ ముందుకు వస్తాం' అంటూ అనిల్ సుంకర ట్వీట్ చేశారు.