రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినా.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయినా.. ఏమాత్రం బలం తగ్గలేదు బలగం(Balagam) సినిమాకు. అదే ప్రభావంతో దూసుకుపోతోంది మూవీ. అంతే కాదు ప్రతిష్టాత్మక అవార్డ్ లను తన ఖాతాల వేసుకుంటుంది. రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది బలగం సినిమా (Balagam).జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తెరకెక్కించిన ఈసినిమాలో.. కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి (Priyadarshi),

Bheems Ceciroleo Wins Best Music Director Award
రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినా.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయినా.. ఏమాత్రం బలం తగ్గలేదు బలగం(Balagam) సినిమాకు. అదే ప్రభావంతో దూసుకుపోతోంది మూవీ. అంతే కాదు ప్రతిష్టాత్మక అవార్డ్ లను తన ఖాతాల వేసుకుంటుంది.
రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది బలగం సినిమా (Balagam). జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తెరకెక్కించిన ఈసినిమాలో.. కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) లీడ్ క్యారెక్టర్స్ చేశారు. బంధువులు, బంధాలు, వాటి విలువలు తెలియజేస్తూ.. తెరకెక్కిన ఈసినిమా... ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కలెక్షన్స్ పరంగానే అవార్డులు పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తోంది బలగం సినిమా. అంతే కాదు ఈసినిమా ఎన్ని అవార్డ్ లు సాధించినా.. బలగంకు అంతకంటే గొప్ప గౌరవం తెచ్చిన సంఘటనలు ఎన్నో జరిగాయి. విడిపోయిన ఎన్నో కుటుంబాలు బలగం సినిమా చూసి కలిసిన సంఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాయి. ఇవే కాదు.. ఎన్నో విలువలు నేర్పిన బలగం సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డులెన్నో వచ్చి చేరాయి తాజాగా మరో అవార్డ్ ఈసినిమా ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమాకి భీమస్ సెసిరోలె సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో (13th Dada Saheb Phalke International Film Festival) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు.81 దేశాలు నుంచి 780 మంది పోటీ చేయగా భీమస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డుని కైవసం చేసుకున్నాడు.ఇక ఈ సినిమాని ఆస్కార్ కి కూడా పంపిస్తామని నిర్మాత దిల్ రాజు ముందే చెప్పేశారు.
బలగం ఖాతాలో ఇప్పటికే ఎన్నో ప్రతి ష్టాత్మక అవార్డ్ లు వచ్చి చేరాయి.. ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను సాధించిన బలగం.. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా ఇంటర్నేషనల్ అవార్డులను సాధించింది. వరుస అవార్డ్ లతో సంచలనం సృష్టించిన ఈసినిమా... తాజాగా దాదా సాహెబ్ అవార్డుని కూడా కైవసం చేసుకుంది. దీంతో రానున్న రోజుల్లో ఎన్ని ఇంకెన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో అని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
The sound of success! 🔥🔥#BheemsCeciroleo's remarkable music in #Balagam has been honored with the Best Music award at the 13th Dada Saheb Phalke International Film Festival, competing against 7️⃣8️⃣0️⃣+ films from 8️⃣1️⃣+ countries!! ❤️🔥❤️🔥#BalagamGoesGlobal pic.twitter.com/lU5KRbbJwy
— Dil Raju Productions (@DilRajuProdctns) April 30, 2023
