బాలకృష్ణ నందమూరి తారక రామారావు (NTR) వారసుడిగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అయ్యినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యకే ఇమేజ్ ని ఏర్పరచుకొని యువరత్న అనే బిరుదుని సంపాదించుకున్నాడు. చాలా కాలం పాటు తన ఆ బిరుదుతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. ఇక బాలయ్యలో మాస్ కోణం ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పుటి నుంచి పరిస్థితి మారిపోయింది. సమరసింహారెడ్డి(Samarasimha Reddy),

వారసత్వంగా వచ్చినా.. సొంత టాలెంట్ తో హీరోగా నిలబడ్డాడు బాలయ్యి(Balakrishna). తనకంటూ.. స్పెషల్ ఇమేజ్ తో పాటు స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ను కూడా సంపాదించుకున్నాడు బాలకృష్ణ. తాజాగా బాలయ్య కు కొత్త టైటిల్ వచ్చింది. నటసింహం నుంచి ఆయన గ్లోబల్ టైటిల్ తో పిలిపించుకోబోతున్నారు.

బాలకృష్ణ నందమూరి తారక రామారావు (NTR) వారసుడిగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అయ్యినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యకే ఇమేజ్ ని ఏర్పరచుకొని యువరత్న అనే బిరుదుని సంపాదించుకున్నాడు. చాలా కాలం పాటు తన ఆ బిరుదుతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. ఇక బాలయ్యలో మాస్ కోణం ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పుటి నుంచి పరిస్థితి మారిపోయింది. సమరసింహారెడ్డి(Samarasimha Reddy), నరసింహనాయుడు(Narasimha Naidu) వంటి సినిమాలతో సింహ గర్జన చేసి ‘నటసింహ’ అనే బిరుదుని సంపాదించుకున్నాడు బాలయ్య.

ఇక ఈసినిమాలు ఎప్పుడైతే మొదలయ్యాయో.. అప్పటి నుంచీ.. నందమూరి నటసింహం అని అనిపించుకుంటూ వస్తున్నాడు బాలకృష్ణ.అయితే ఇప్పుడు ఆ బిరుదు మారిపోనుంది. ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజున నాడు కొత్త బిరుదుని అభిమానులు బాలయ్యకి ఇవ్వబోతున్నారు. ఇక బాలయ్యకు కొత్తగా గ్లోబల్ లయన్” అనే బిరుదుని అభిమానులు ఇస్తున్నారు. కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ లోని ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ బిరుదుని కాదనలేరు

బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం 108వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) టైటిల్ ని అనౌన్స్ చేశారు టీమ్. అంతే కాదు ఇదే టైటిల్ తో బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను రిలజ్ చేయబోతున్నారు మూవీ టీమ్.

Updated On 9 Jun 2023 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story