నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) సినిమా వస్తున్నదంటే చాలు అభిమానుల్లో పూనకాలు వస్తాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులపై లెక్కలేసుకుంటుంటారు. బాలయ్య హీరోగా టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Bhagavanth Kesari
నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) సినిమా వస్తున్నదంటే చాలు అభిమానుల్లో పూనకాలు వస్తాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులపై లెక్కలేసుకుంటుంటారు. బాలయ్య హీరోగా టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల(Sreeleela), బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు. 'గీసారి మోత మోగిపోయే అప్‌డేట్‌తో ఒస్తున్నం.. మీ అంచనాలను ఆకాశమంత ఎత్తులో ఉంచండి' అంటూ భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 25 సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాటలు అద్భుతంగా ఉంటాయని ఫ్యాన్స్ అంటున్నారు.
చిత్ర యూనిట్ మెంబర్స్ బాలకృష్ణ పాపులర్ డైలాగ్స్‌తో కట్ చేసిన వీడియో ఒకటి మేకర్స్ షేర్ చేయగా నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. భగవంత్ కేసరి సినిమాను ఓవర్సీస్‌లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. అక్టోబర్ 18న అమెరికాలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉండబోతున్నాయని ఇప్పటికే మేకర్స్ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. బిగ్ స్క్రీన్‌పై బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని అవతార్‌లో చూసి అక్టోబర్ 19న పండగ చేసుకోవడం గ్యారంటీ.. అంటూ విడుదల తేదీని తెలియజేస్తూ అందించిన అప్‌డేట్‌తో అభిమానులు సంబరపడుతున్నారు. బాలకృష్ణ ఈ సారి భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నాడని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. భగవంత్ కేసరి చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
