ఈసినిమా నుంచి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. మఖ్యంగా టీజర్ లో బాలయ్య డైలాగ్స్ కు ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఇక తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు టీమ్. ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.

గెట్ రెడీ బాలయ్యా ఫ్యాన్స్(Balayya Fans).. భగవంత్ కేసరి(Bhagavanth kesari) వచ్చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం సినిమా రిలీజ్ డేట్ ను ఇచ్చేశారు మూవీ టీమ్.

వరుస సినిమాలతో యమా జోరు మీద ఉన్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna). ఆయన తాజాగా అనిల్ రావిపూడి(anil ravipudi) డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈమూవీలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపూ షూటింగ్ ఎండింగ్ లొ ఉన్న ఈసినిమాలో శ్రీలీల(sreeleela) కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.

ఇక ఈసినిమా నుంచి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. మఖ్యంగా టీజర్ లో బాలయ్య డైలాగ్స్ కు ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ఇక తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు టీమ్. ఓ పోస్టర్ ద్వారా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. గీ ముసురు స‌లిలో మంట లాంటి ముచ్చ‌ట అంటూ... బాలయ్య మూవీ రిలీజ్ డేట్ పూ ఊరించిన మూవీ టీమ్.. ఫ్రెష్ గా ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ... భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది అంటూ క్యాప్ష‌న్ ఇస్తూ కొత్త పొస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

భగవంత్ కేసరి సినిమాను ఈ దసరా కానుకగా.. రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టతమ్. ఈ విషయాన్ని ఇంతకు ముందే చెప్పినా.. ఇప్పటు అందరికి క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. అక్టోబ‌ర్ 19, 2023న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. కొత్త పోస్ట‌ర్‌లో బాల‌య్య రెండు చేతుల్లో రెండు గ‌న్స్‌ ప‌ట్టుకుని చాలా గంభీరంగా క‌నిపిస్తున్నాడు. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. బాలయ్య లుక్ కోసం ఎదరుచూస్తున్న ఫ్యాన్స్ కు అదరిపోయే లుక్ ను అందించాడు సీనియర్ హీరో.

Updated On 23 July 2023 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story