బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీ నటి హేమకు భారీ ఊరట లభించింది.
బెంగళూరు(Bangolre) రేవ్ పార్టీ(Raveparty) కేసులో అరెస్టయిన తెలుగు సినీ నటి హేమకు(Hema) భారీ ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్(Bail) మంజూరు చేసింది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది మహేశ్ కిరణ్‌శెట్టి వాదించారు. ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం (CCB) న్యాయవాది కోర్టుకు అందజేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.