టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas).. బాలీవుడ్ ఎంట్రీ(Bollywood Entry) ఇస్తున్న సినిమా ఛత్రపతి(Chatrapathi ). ఎస్.ఎస్ రాజమౌళి(S. S. Rajamouli) తెలుగులో తెరకెక్కించిన సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. రీసెంట్ గా సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు టీమ్.

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas).. బాలీవుడ్ ఎంట్రీ(Bollywood Entry) ఇస్తున్న సినిమా ఛత్రపతి(Chatrapathi ). ఎస్.ఎస్ రాజమౌళి(S. S. Rajamouli) తెలుగులో తెరకెక్కించిన సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. రీసెంట్ గా సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు టీమ్.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి మూవీని అదే టైటిల్ తో.. హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఈసినిమాను.. హిందీలో వినాయక్ చేస్తున్నాడు. ఇక తెలుగు యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ఈసినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. ఇక తాజాగా ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ లుక్ అప్పట్లో ప్రభాస్ లుక్ కు చాలా దగ్గరగా ఉంది. బ్యాక్ నుంచి సాయి శ్రీనివాస్ ను డిఫరెంట్ గా చూపించారు మూవీ టీమ్.

ఛత్రపతి సినిమాలో కాట్ రాజుతో ఫైటింగ్ జరిగే సీన్ లో.. ప్రభాస్ కు కళశం దొరకగా..దానితో తన కళ్లలో పడిన ఇసుకను కడిగేసుకుంటాడు. ఈ సీన్ లోంచి ఓ అద్భుతమైన పోస్టర్ ను సాయి శ్రీనివాస్ నుంచి రిలీజ్ చేశారు డైరెక్టర్ వినాయక్. ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినిమాపై ఇటు టాలీవుడ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ పాత్రను చూశారు.. ఇక సాయి తేజ్ ఎలా చేస్తాడు అని అంతా .. ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో ఈసినిమాతో.. హీరో మెటీరియల్ అని బెల్లంకొండవారి వారసుడు అనిపించుకుండా..? లేదా అని కూడా చర్చించుకుంటున్నారు టీమ్.

ఇక ఛత్రపతి సినిమా విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ కు మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. 18 ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటించగా... ప్రభాస్ అమ్మగా భానుప్రియ నటించింది. యాక్షన్.. కామెడీ, లవ్ ట్రాక్స్ అన్నీ సమపాళ్లలో చూపించారు జక్కన్న. ఇక ప్రభాస్ ను చూసి ఆయన లేడీ ఫ్యాన్స్ అంతా సుమ్మా మసూరియా అంటూ తెగ కలలు కన్నారు. ఇక ఇప్పుడు.. ఇన్నేళ్లతరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

వి.వి. వినాయక్‌ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ.. రిలీజ్ డేన్ ను కూడా అనౌన్స్ చేశారు టీమ్. ఒరిజినల్‌ టైటిల్‌ ఛత్రపతినే కొనసాగిస్తున్నారు మేకర్స్.. ఇక ఈసినిమాను సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహంతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి ఉన్నాడు. ఈ సినిమాను పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై జయంతి లాల్‌ నిర్మిస్తున్నాడు.

Updated On 27 March 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story