మీకు జయ జానకీ నాయక(Jaya Janaki Nayaka) సినిమా గుర్తున్నదా? బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Belamkonda srinivas), రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) నటించారు. ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాను మళ్లీ ఎందుకు గుర్తుచేసుకోవడమంటారా? మనకు నచ్చకపోవచ్చు కానీ, నార్త్ ఇండియన్స్‌కు మాత్రం తెగ నచ్చేసింది.
మీకు జయ జానకీ నాయక(Jaya Janaki Nayaka) సినిమా గుర్తున్నదా? బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Belamkonda srinivas), రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) నటించారు. ఈ అట్టర్ ఫ్లాప్ సినిమాను మళ్లీ ఎందుకు గుర్తుచేసుకోవడమంటారా? మనకు నచ్చకపోవచ్చు కానీ, నార్త్ ఇండియన్స్‌కు మాత్రం తెగ నచ్చేసింది. హిందీలో డబ్ అయిన ఈ సినిమా య్యూ ట్యూబ్‌లో మాత్రం దుమ్ము దులిపేస్తున్నది. లేటెస్ట్‌గా 800 మిలియన్ల వ్యూస్‌తో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ సినిమాను హిందీలో ఖుంఖార్(Khoonkhar) పేరుతో విడుదల చేశారు. థియేటర్లలో ఎవరూ చూడలేదు ఈ సినిమాను. సౌత్ డబ్బింగ్ మూవీస్‌లో ఇప్పటివరకు జయ జానకి నాయక మాత్రమే ఈ రికార్డ్ సాధించింది. యశ్ నటించిన కేజీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంతకు మునుపే హిందీ వర్షన్ కేజీఎఫ్ సినిమాను జయ జానకీ నాయక సినిమా అధిగమించేసింది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 772 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో కొనసాగుతోంది. అల్లుడు శీను చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాలో నటించాడు. ఈ మూవీ ఆగస్ట్ 11వతేదీ 2017లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సాయి శ్రీనివాస్‌కు ఏ రకంగానూ ఉపయోగపడలేదు. దేవిశ్రీ ప్రసాద్(Devi sri Prasad) సంగీతం కూడా సినిమాను హిట్ చేయలేకపోయింది. పైగా ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.