సినిమా హీరోయిన్‌లన్న తర్వాత అందాల ఆరబోత కంపల్సరీ అనే భావన చాలా మందికి ఉంది. స్కిన్‌ షో చేస్తే తప్ప పరిశ్రమలో ఎదగడం కష్టమనే అనుకుంటారు. ఇది కేవలం అర్థసత్యమే! సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ చేయకుండానే అగ్ర కథానాయికలుగా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. మహానటి సావిత్రి(Savitri), సౌందర్య(Soundharya) వంటి తారలు మనకు గుర్తుకు రాకుండా మానరు.

సినిమా హీరోయిన్‌లన్న తర్వాత అందాల ఆరబోత కంపల్సరీ అనే భావన చాలా మందికి ఉంది. స్కిన్‌ షో చేస్తే తప్ప పరిశ్రమలో ఎదగడం కష్టమనే అనుకుంటారు. ఇది కేవలం అర్థసత్యమే! సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ చేయకుండానే అగ్ర కథానాయికలుగా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. మహానటి సావిత్రి(Savitri), సౌందర్య(Soundharya) వంటి తారలు మనకు గుర్తుకు రాకుండా మానరు.వీరితో పాటు స్నేహ(Sneha) కూడా హోమ్లీ బ్యూటీగా, స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కాసింత విరామం ఇచ్చిన స్నేహ రామ్‌చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళ నటుడు ప్రసన్నుమార్‌ను(Prasanna Maran) స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. నిజానికి నటి స్నేహ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి. అయితే స్నేహ తల్లిదండ్రులు రాజారామ్‌, పద్మావతి వ్యాపార రిత్యా ముంబాయికి వెళ్లారు. స్నేహ కూడా అక్కడే జన్మించారు. తమిళ సినీ పరిశ్రమలో స్థిరపడిన స్నేహ, ప్రసన్న జోడి మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉంటుంది. 11 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటికీ చిన్నపాటి గొడవలు లేకుండా జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. పెళ్లయ్యాక ఇద్దరూ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ప్రసన్నకుమార్‌ కంటే ముందే స్నేహ మరో వ్యక్తిని ప్రేమించారట! ఈ విషయాన్ని తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్‌ రంగనాథన్‌(Bailwan Ranganathan) చెప్పారు. అయితే ఆ ప్రేమ సక్సెస్‌ కాలేదట! దాంతో ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి స్నేహ వచ్చారట!'స్నేహ ప్రసన్నతో ప్రేమలో పడకముందే నిర్మాత రవితో(Producer Ravi) ప్రేమలో ఉన్నారు. కొంతకాలం తర్వాత వారి ప్రేమ పెళ్లి దాకా కూడా వెళ్లింది. అంతేకాకుండా వారిద్దరూ డైమండ్ రింగ్స్ మార్చుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు' అని బైల్వాన్‌ రంగనాథన్‌ చెప్పారు.
నిశ్చితార్థం తర్వాత, స్నేహ తన ప్రియుడు రవికి తన పట్ల చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని గ్రహించిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడం సరికాదని నిర్ణయం తీసుకున్నట్లు రంగనాథన్‌ అన్నారు. అలా రవితో తన ప్రేమకు స్నేహ గుడ్‌బై చెప్పినట్టు ఆయన గుర్తుచేశాడు. ఈ సంఘటన తర్వాత ప్రసన్నతో పరిచయం ఆమెకు ఏర్పడింది. కానీ ప్రేమ పట్ల తనకు నమ్మకం లేకపోవడంతో మొదట ప్రసన్నకు కూడా ఆమె దూరంగా ఉండేదని తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని ఆయన అన్నాడు. వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారని బైల్వాన్ రంగనాథన్ తెలిపారు. వాళ్లిద్దరూ మంచి కపుల్స్‌ అని బైల్వాన్‌ కితాబు ఇచ్చారు. ప్రసన్న, స్నేహ మొదట 2009 థ్రిల్లర్ అచ్చబేడు అనే సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వారి పెళ్లి అనంతరం స్నేహ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. మళ్లీ కొంత కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ రోల్స్ చెస్తుంది. కొన్నిసార్లు స్నేహ రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపిస్తుంది. ప్రసన్న చివరిసారిగా దుల్కర్ సల్మాన్ చిత్రం కింగ్ ఆఫ్ కొత్తలో నటించాడు. ప్రస్తుతం ప్రసన్న పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Updated On 28 Sep 2023 12:04 AM GMT
Ehatv

Ehatv

Next Story