ప్రస్తుతం పొలిటికల్ గా..సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతుంది. బాగా పాపులర్ అవుతోంది బర్రెలక్క అలియాస్ శిరీష(Sirisha). నిరుద్యోగి అయిన ఆమె.. ఉద్యోగం రాక.. బర్రెలు కాసుకుంటూ..ఆ వీడియోతో ఫేమస్అయ్యింది. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్(Bigg Boss House) లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో బాగా పాపులర్ అయ్యి.. ఫాలోయింగ్ తో పాటు.. తాజాగా సెక్యూరిటీ కూడా పొందిన బర్రెలక్కను బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించడానికి ప్రయత్నాలుజరుగుతున్నాయట.

కొంత మంది సామాన్యులు ఓవర్ నైట్ స్టార్లు అవుతుంటారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంటారు. అందులో ప్రస్తుతం వైరల్ అవుతున్న పేరు బర్రెలక్క(Barrelakka). పొలిటికల్ గా హాట్ న్యూస్ అవుతున్న బర్రెలక్క... బిగ్ బాస్(Bigg Boss) లోకి వస్తే ఎలా ఉంటంది..?

ప్రస్తుతం పొలిటికల్ గా..సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతుంది. బాగా పాపులర్ అవుతోంది బర్రెలక్క అలియాస్ శిరీష(Sirisha). నిరుద్యోగి అయిన ఆమె.. ఉద్యోగం రాక.. బర్రెలు కాసుకుంటూ..ఆ వీడియోతో ఫేమస్అయ్యింది. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్(Bigg Boss House) లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో బాగా పాపులర్ అయ్యి.. ఫాలోయింగ్ తో పాటు.. తాజాగా సెక్యూరిటీ కూడా పొందిన బర్రెలక్కను బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించడానికి ప్రయత్నాలుజరుగుతున్నాయట. అయితే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోవస్తోంది. మహా అయితే ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. మరి ఇప్పుడు ఎలా బిగ్ బాస్ లోకి వస్తుంది అన్న డౌట్ రావచ్చు. అయితే ఇక్కడేచిన్న ట్విస్ట్ ఉంది.

బర్రెలక్కను ఇప్పుడు ఆసీజన్ లో కాకుండా..నెక్ట్స్ సీజన్ వరకూ హౌస్ లోకి తీసుకోవాలి అని చూస్తున్నారట. ప్రభుత్వానికి వ్యాతిరేకంగా బర్రెలక్క చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాంతో ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చేసింది. స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసింది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడి పై దాడి జరగడం.. ఆమెకు హైకోర్టు(High Court) సెక్యూరిటీ ఇవ్వడంతో ఇప్పుడు బర్రెలక్క బాగా ఫేమస్ అయ్యింది. దాంతో ఆమె నెక్ట్స్ ఇయర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం ఖాయం అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

బర్రెలక్క కు వచ్చిన క్రేజ్ ను వాడుకోవడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తుందని .. ఇప్పటి నుంచే ఆమెను సంప్రదింపులు కూడా జరుపుతున్నారని.. ఎలక్షన్స్ తర్వాత దీని పై పూర్తి క్లారిటీ వస్తుందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ వార్తల్లో వాస్తవం లేదని.. భవిషత్తులో బిగ్ బాస్ ఛాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు కొందరు.

Updated On 28 Nov 2023 8:19 AM GMT
Ehatv

Ehatv

Next Story