హత్య కేసులో(Murder case) పాపులర్‌ కన్నడ హీరో దర్శన్‌ను(Darshan) బెంగళూరు పోలీసులు(Bangolre Police) అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున మైసూర్‌లోని(Mysore) ఆర్‌ఆర్‌ నగర్‌లో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో కామాక్షిపాళ్య పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేశారు.

హత్య కేసులో(Murder case) పాపులర్‌ కన్నడ హీరో దర్శన్‌ను(Darshan) బెంగళూరు పోలీసులు(Bangolre Police) అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున మైసూర్‌లోని(Mysore) ఆర్‌ఆర్‌ నగర్‌లో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో కామాక్షిపాళ్య పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేశారు. దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు సమాచారం. రెండు రోజుల కిందట కర్నాటకలోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుడు, చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిగా గుర్తించారు. ఈ హత్య కేసులో దర్శన్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చి వినయ్‌కు చెందిన షెడ్డులో ఉంచారు. ఆ సమయంలో రేణుకా స్వామిపై నలుగురు కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ టీమ్‌లో దర్శన్ ఉన్నట్లు సమాచారం. రేణుకా స్వామి మరణించాక మృతదేహాన్ని ఒక కల్వర్టులో పడేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు పోలీసులు వద్ద అంగీకరించారని సమాచారం. నటి పవిత్ర గౌడ్‌పై రేణుకా స్వామి సోషల్‌ మీడియాలో కించపరిచే పోస్టులు పెట్టారు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే రేణుకాస్వామిని హత్య చేశారు. పవిత్ర గౌడ్‌తో దర్శన్‌కు సంబంధం ఉన్నదంటున్నారు. ఆయనతో సంబంధం ఉన్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పవిత్రనే పోస్ట్‌ చేసింది. దీనిపై దర్శన్‌ భార్య విజయలక్ష్మి నటి పవిత్ర గౌడ్‌పై విమర్శలు చేశారు.

Updated On 11 Jun 2024 4:02 AM GMT
Ehatv

Ehatv

Next Story