కమెడియన్‌గా సినిమాల్లో అడుగుపెట్టి అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేశ్‌(Bandla Ganesh) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్‌లో ఆయన పెట్టే పోస్టులు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తుంటాయి. కొన్ని వివాదాలను సృష్టిస్తాయి. మొన్నామధ్య గురూజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కమెడియన్‌గా సినిమాల్లో అడుగుపెట్టి అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేశ్‌(Bandla Ganesh) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్‌(Twitter)లో ఆయన పెట్టే పోస్టులు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తుంటాయి. కొన్ని వివాదాలను సృష్టిస్తాయి. మొన్నామధ్య గురూజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురూజీ అని అన్నారే కానీ ఫలానా అని ట్వీట్‌లో ఎక్కడా బండ్ల గణేశ్‌ చెప్పలేదు. గ్రేట్‌ ఆంధ్రా అనే వెబ్‌ సైట్‌ మాత్రం బండ్ల గణేశ్‌ ట్వీట్లతో ఓ ఆర్టికల్ రాసింది. తాజాగా బండ్ల గణేశ్‌ పెట్టిన ట్వీట్లను బేస్‌ చేసుకుని ఓ స్టోరీని అప్‌లోడ్‌ చేసింది. అందుకే చేతికి మట్టి అట్టకుండా పలువురు కామెంట్లు చేస్తున్నారనీ, బండ్లపై పలు రకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయని ఆర్టికల్‌లో పేర్కొంది. కింద భూమి ఉందనే వాస్తవంలో బతుకుతానని చెప్పుకునే బండ్ల గణేశ్..

ఎప్పటికప్పుడు మాట మారుస్తుంటారని గ్రేట్‌ ఆంధ్రా పేర్కొంది.ఇది బండ్ల గణేశ్‌కు బాగా కోపం తెప్పించింది. కోపం వచ్చిన తర్వాత గమ్మున ఉండడు కదా! వెంటనే గ్రేట్‌ ఆంధ్రాపై విరుచుకుపడ్డారు. ట్వీట్టర్‌లో చెడుగుడు ఆడేశారు. 'అరే వెంకట్‌రెడ్డి. నువ్వు పెద్ద బ్రోకర్‌. ఇక్కడ మీ మూర్తిగాడు చిన్న బ్రోకర్‌. నీలివార్తలు రాసుకుని, నీలి బతుకులు బతుకుతూ.. దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫుట్‌. మేము ప్రేమిస్తాం. పూజిస్తాం. ప్రాణం ఇస్తాం. కోపం వస్తే అలుగుతాం. ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫుట్‌. సినిమా వాళ్ల వార్తలు, సినిమా వాళ్ల గురించి ఇంటర్వ్యూలు లేకపోతే నీకు పబ్బం గడవదురా వెంకీగా.. నువ్వు మనిషివైతే, నీకు సిగ్గు, శరం ఉంటే నువ్వు తినేది అన్నమే అయితే ఒక్కసారి నాకు ప్రత్యక్షంగా కనబడు. నీలి వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాలు గురించి చూసుకోరా బఫున్‌ కొడకా.. నిజాయితీగలవాడితో దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీతిగా బతికేవాడి జోలికి రాకు. మాడి మసైపోతావ్‌' అంటూ ట్వీటారు బండ్ల గణేశ్‌. మరి బండ్ల గణేశ్‌ ట్వీట్‌కు గ్రేట్ ఆంధ్రా ఎలా రియాక్టవుతుందో చూడాలి!

Updated On 29 May 2023 7:08 AM GMT
Ehatv

Ehatv

Next Story