బండ్ల గణేశ్‌(Bandla Ganesh)  అంటే తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. సినిమాల పట్ల, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి ఆయన పరిచితుడే! కమెడియన్‌గా సినిమాల్లో ప్రవేశించి ఆ తర్వాత అగ్రశ్రేణి నిర్మాత అయ్యారు. సోషల్‌ మీడియాలో బండ్ల గణేష్‌ చాలా యాక్టివ్‌. ఆయన పాపులారిటీ పదిలంగా ఉండటానికి ఇదే కారణం. ఆయన మాటలు, చేష్టలు చిత్రంగా ఉంటాయి. సంచలనం సృష్టిస్తుంటాయి.

బండ్ల గణేశ్‌(Bandla Ganesh) అంటే తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. సినిమాల పట్ల, రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి ఆయన పరిచితుడే! కమెడియన్‌గా సినిమాల్లో ప్రవేశించి ఆ తర్వాత అగ్రశ్రేణి నిర్మాత అయ్యారు. సోషల్‌ మీడియాలో బండ్ల గణేష్‌ చాలా యాక్టివ్‌. ఆయన పాపులారిటీ పదిలంగా ఉండటానికి ఇదే కారణం. ఆయన మాటలు, చేష్టలు చిత్రంగా ఉంటాయి. సంచలనం సృష్టిస్తుంటాయి. నెట్టింట్‌ వైరల్‌ అవుతుంటాయి. ఎవరినైనా ప్రశంసించాలన్నా, విమర్శించాలన్నా ఆయన ట్విట్టర్‌ను ఉపయోగిస్తుంటారు.

మొన్నామధ్య దర్శకుడు హరీశ్‌ శంకర్‌(Harish Shankar), బండ్ల గణేశ్‌(Bandla Ganesh) మధ్య ట్విట్టర్‌లోనే బోల్డంత యుద్ధం జరిగింది. ఇద్దరూ ట్వీట్లతో మాటల యుద్ధం చేసుకున్నారు. లేటెస్ట్‌గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas)పై పరోక్షంగా విమర్శనాస్త్రాలను సంధించారు బండ్ల గణేశ్‌. రీసెంట్‌గా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు బండ్ల గణేశ్‌. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ బండ్లతో తన సందేహాన్ని పంచుకున్నారు. బండ్లన్న నాకు ప్రొడ్యూసర్‌ అవ్వాలని ఉంది అని ట్వీట్‌ చేసిన ఆ నెటిజన్‌కు బండ్ల చాలా సెటైరికల్‌గా సమాధానం ఇచ్చారు. గురూజీని కలవండి.

ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది అని గణేశ్‌ ఇచ్చిన జవాబు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడని టాక్‌ ఉంది. నిజమేనా? అని మరో నెటిజన్‌ బండ్ల గణేశ్‌ను ప్రశ్నించారు. దీనికి 'అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ బండ్ల గణేశ్‌ సమాధానమిచ్చారు. ఈ ట్వీట్‌ కూడా హాట్ టాపిక్‌గా మారింది. సినీ పరిశ్రమలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌నే గురూజీ అని పిల్చుకుంటారు. నెటిజన్లు కూడా బండ్ల గణేశ్‌ ట్వీట్లు త్రివిక్రమ్‌ను ఉద్దేశించినవేనని అనుకుంటున్నారు. ఈ విషయంలో బండ్ల గణేశ్‌ క్లారిటీ ఇస్తే తప్ప డౌట్స్‌ పోవు!

Updated On 27 May 2023 2:30 AM GMT
Ehatv

Ehatv

Next Story