ఈమధ్య స్టార్ సెలబ్రిటీలు వేసుకున్న బట్టలు, నగలు, ఆకరికి చెప్పుల కాస్ట్ కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఈక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా వేసుకున్న హడి వార్తల్లో నిలుస్తోంది.

వార్తల్లో నిలుస్తోంది.

మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 2019 తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాదు ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా మారిపోయాడు. దాంతో గేమ్ ఛేంజర్ రిజల్ట్ గురించి అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ఫుల్ ట్రెండ్ అయి వైరల్ అయ్యాయి. గేమ్ ఛేంజర్ ట్రైలర్ జనవరి 2న రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. అమెరికాలో తెగ హడావిడి చేసిన టీమ్.. ఇఫ్పుడు ఇండియాలో లో ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా రామ్ చరణ్ బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్‌స్టాప‌బుల్‌ షోకి వచ్చారు.

రీసెంట్ గా అన్‌స్టాప‌బుల్‌ షో రామ్ చరణ్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ కి రామ్ చరణ్ తో పాటు చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, నిర్మాత విక్రమ్ రెడ్డి వచ్చారు. ఈ షూటింగ్ ఫోటోలు ఇప్పటికే బయటకురాగా... అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ షోలో రామ్ చరణ్ వేసుకొచ్చిన బ్లాక్ హుడి.. పై అందరికళ్లు పడ్డాయి. ఈ హుడీ చరణ్ కు చాలా బాగుంది. ఇక ఫ్యాన్స్ వదులుతారా..? అది ఏంటి.. దాని బ్రాండ్ ఏంటి..? ఎంత కాస్ట్ పెట్టారు. ఇలా అన్ని వెతకడం స్టార్ట్ చేశారు. వెతికి వెతికి.. ఆ హుడి హిస్టరీ మొత్తం సాధించారు. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ డిజైన్ తో ఉన్న ఈ హుడీ కాస్ట్ తెలిసి అంతా ఆశ్చర్చపోతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్ని బట్టలు చెప్పులు వేలల్లో లక్షల్లో కూడా ఉంటుంటాయి. అలానే ఈ హుడి కూడా అమిరి బ్రాండ్ హుడీ కావడం.. దాని రేటు అక్షరాలా లక్ష పైనే కావడంతో జనాలు నోరెళ్ళబెడుతున్నారు. అయితే ఆన్ లైన్ లో 1 లక్షకు పైనే కాస్ట్ ఉన్న ఈ హుడి డిస్కౌంట్ లో 88 వేలకు వస్తుంది.

ఇక సినిమా విషయానికి వస్తే..శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ హిట్ అవ్వడం అటు చరణ్ కు.. ఇటు శంకర్ కు చాలా ముఖ్యం. దాదాపు 3 ఏళ్ళకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈసినిమా రిజల్ట్ గురించి అంతా టెన్షన్ గా ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో సినిమా ఓపెనింగ్ అయ్యింది. ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయన్ గా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story