నందమూరి వంశంలోంచి ఇప్పటికే మూడో తరం వారసులుగా తారక్‌(Tarak), కల్యాణ్‌రామ్‌లు(Kalyanram) నిలదొక్కుకున్నారు. తాత ఎన్టీఆర్‌కు తగ్గ మనవళ్లుగా పేరు సంపాదించుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అయితే తాత పేరును నిలబెడుతున్నారు కూడా! ఇప్పుడీ లిస్టులో మరో మనవడు జాయిన్‌ కాబోతున్నాడు. అతడెవరో కాదు బాలకృష్ణ(Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja). ఇతడు సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని బాలయ్య ఫాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

నందమూరి వంశంలోంచి ఇప్పటికే మూడో తరం వారసులుగా తారక్‌(Tarak), కల్యాణ్‌రామ్‌లు(Kalyanram) నిలదొక్కుకున్నారు. తాత ఎన్టీఆర్‌కు తగ్గ మనవళ్లుగా పేరు సంపాదించుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అయితే తాత పేరును నిలబెడుతున్నారు కూడా! ఇప్పుడీ లిస్టులో మరో మనవడు జాయిన్‌ కాబోతున్నాడు. అతడెవరో కాదు బాలకృష్ణ(Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ తేజ(Mokshagna Teja). ఇతడు సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని బాలయ్య ఫాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ వార్తలు వచ్చేవే కానీ ఏ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీకి మంచి ముహూర్తం దొరకలేదు. కొడుకు ఎంట్రీ కోసం బాలయ్య గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట! ఇప్పటికే పలువురు దర్శకులను లైన్‌లో పెట్టాడని.. అన్నీ కుదిరితే అతి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ఓ రూమార్‌ తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari) సెట్‌లో మోక్షజ్ఞ కనిపించాడు.

అనిల్‌ రావిపూడి(anil ravipudi), శ్రీలీలతో(Sreeleela) మోక్షజ్ఞ కబుర్లు చెబుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. మోక్షజ్ఞ కేవలం సెట్‌ను విజిట్‌ చేయడం కోసం రాలేదని, ఈ సినిమాలో ఓ గెస్ట్‌ అప్పియరెన్స్‌(Guest appearence) ఇవ్వబోతున్నాడని కొందరు అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో శ్రీలీలను కాపాడే సీన్‌లో రెప్పపాటు కనిపించబోతున్నాడని కథనాలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతుంతో ఆ భగవంత్‌ కేసరికే తెలియాలి. అలాగని ఈ వదంతులను కొట్టిపారేయలేం. గతంలో అఖిల్‌ కూడా మనం సినిమాలో ఓ రెప్పపాటు కనిపించి అక్కినేని అభిమానులతో ఈలలు వేయించుకున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వీలైనప్పుడల్లా తండ్రి నటిస్తున్న సెట్స్‌లో దర్శనమిస్తున్నాడు. ఆ మధ్య వీరసింహా రెడ్డి సెట్‌లోనూ మోక్షజ్ఞ కనిపించాడు. అయితే అదే సమయంలో మోక్షజ్ఞ భారీ కాయాన్ని చూసి నందమూరి అభిమానులు సైతం పెదవి విరిచారు. సర్జరీ చేయించుకున్నాడో లేక కష్టపడి తగ్గాడో కానీ నెలల గ్యాప్‌లోనే సన్నగా మారిపోయాడు. ఇక ఇటీవలే నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్‌లోనూ మోక్షజ్ఞను చూసి బాలయ్య ఫ్యాన్స్‌ మురిసిపోయారు.

Updated On 29 Aug 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story