మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఆవేశం సినిమా తెలుగువారి దృష్టిలో పడింది.

మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఆవేశం సినిమా తెలుగువారి దృష్టిలో పడింది. ఆల్‌రెడీ ఓటీటీ(OTT)లో ఆవేశం(Avesham) సినిమాను తెలుగులోనే చాలామంది చూశారు. ఒకటికి రెండు సార్లు చూశారు. ఫహాద్‌ పాజిల్‌(phad fazil) నటనకు జేజేలు పలికారు. ఏప్రిల్‌ మాసంలో థియేటర్లలో రిలీజైన ఆవేశం సినిమా బ్రహ్మండమైన వసూళ్లను సాధించింది. జితూ మాధవన్‌(Jithu Madhavan) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan),అశీష్‌ విద్యార్థి(Ashish Vidyarthi),సజిన్ గోబు(Sajin Gopu), పూజా మోహన్‌రాజ్(Pooja Mohanraj) తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారట! అలాగని ఫిల్మ్‌నగర్‌(Filmnagar)లో చెప్పుకుంటున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌ పాత్రను నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna) పోషించబోతున్నారట! బాలయ్యకు కూడా కథ బాగా నచ్చిందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మలయాళ(Malayalam) సినిమాను తెలుగు నేటివిటికి తగినట్టుగా మార్చనున్నారు.

ehatv

ehatv

Next Story