అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి పవన్‌కళ్యాణ్ హంగామా చేయబోతున్నారు. దీనికి సంబందించిన ప్రోమో విజువల్స్ బీభత్సంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈషోపై అప్పుడే భారీ అంచనాలు కూడా పెట్టుకుంటున్నారు అభిమానులు. షో స్ట్రీమింగ్‌ సంక్రాంతికే అంటూ బాలయ్య అండ్‌ పవన్‌ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. కానీ, అంతలోనే వీరి ఆశలపై నీళ్లు చల్లారు ఇద్దరు అగ్ర కథానాయకులు. షో విడుదలకు ఇంకాస్త సమయం పడుతుందని చావు వార్త చల్లగా చెప్పారు. అయితే, ఇదే అదునుగా ఈ […]

అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి పవన్‌కళ్యాణ్ హంగామా చేయబోతున్నారు. దీనికి సంబందించిన ప్రోమో విజువల్స్ బీభత్సంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈషోపై అప్పుడే భారీ అంచనాలు కూడా పెట్టుకుంటున్నారు అభిమానులు. షో స్ట్రీమింగ్‌ సంక్రాంతికే అంటూ బాలయ్య అండ్‌ పవన్‌ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. కానీ, అంతలోనే వీరి ఆశలపై నీళ్లు చల్లారు ఇద్దరు అగ్ర కథానాయకులు. షో విడుదలకు ఇంకాస్త సమయం పడుతుందని చావు వార్త చల్లగా చెప్పారు. అయితే, ఇదే అదునుగా ఈ ఎపిసోడ్‌ను ఓటీటీలో కాదు, నేరుగా థియేటర్స్‌లోనే విడుదల చేయాలంటూ పవన్‌ ఫ్యాన్స్ డిమాండ్‌ చేస్తున్నారట.

ఆహా వేదికగా బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే‌ షోకు ఊహించని క్రేజ్‌ వస్తుంది. ఈ షో ఇండియాలోనే నెంబరు వన్‌ టాక్ షోగా నిలిచింది. ఎక్కడా ఇంటర్యూలు ఇవ్వడానికి సిద్దపడని స్టార్స్ కూడా బాలయ్య షోలో హల్‌చల్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఈ షోలోనే చంద్రబాబు, లోకేష్‌లు వచ్చి చేసిన హంగామా, సరదా సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. అంతేకాకుండా సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు మ‍‎హేష్‌తో చేసిన సంభాషణలు నవ్వులు పుట్టించాయి. మొత్తానికి షో సీజన్ వన్‌ వండర్‌ఫుల్‌గా విన్నైంది. ఓ వైపు బాలయ్య సినిమాల్లో అదరగొడుతూనే మరోవైపు షోలోనూ హల్‌చల్ చేస్తూ కేక పుట్టిస్తున్నాడు. చాలామంది టాలీవుడ్ సినీతారలు, రాజకీయ నాయకులు గెస్ట్‌లుగా వస్తుండటం, బాలయ్య వారితో పంచులతో హంగామా చేస్తుండటం, మధ్యలో డైలాగులు వదలుతుండటంతో బాలయ్య అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

సీజన్-2లో మాత్రం యూత్‌లో పాపులారిటీ సంపాందించుకున్న స్టార్స్ బాలయ్యతో అదరగొట్టనున్నారట. రీసెంట్‌గా ప్రభాస్ గెస్ట్‌గా బాలయ్యతో కలిసి చేసిన ఎపిసోడ్ పార్ట్ వన్ భారీగా దూసుకుపోయింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసే వారి సంఖ్య కూడా భారీగానే పెరిగింది. ఈ దెబ్బకు సర్వర్లు కూడా బిజీ అయ్యాయి. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటటమే కాకుండా, 12 గంటల్లో 50 మిలియన్ల మంది చూడటంతో ఆహా నిర్వాహకులు ఆహా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రాబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనికి సంబందించి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొన్న షో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షో కోసం పవన్ తన హరిహర వీరమల్లు సినిమాకు బ్రేక్ ఇచ్చి వస్తున్నారట. దీంతో ఇటు బాలయ్య ఫ్యాన్స్, అటు పవన్ ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారట. షోలో ఎవరూ తగ్గేదేలేదంటూ స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారట. ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క.. అంటూ పవన్ షో కోసం ప్లాన్ చేస్తున్నారట.

ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ కూడా ఆహా ప్లాట్‌ఫామ్‌ను షేర్‌ చేసుకోబోతున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. పవన్ కలిసి చేసే ఎపిసోడ్‌లో బాలయ్య రాజకీయపరంగా, సినిమా పరంగా ఇంకా పర్సనల్ లైఫ్ గురించి ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారనే ఉత్కంఠ ఫ్యాన్స్‌లో కనిపిస్తుంది. తాజాగా విడుదల అయిన షో విజువల్స్‌... పవర్‌స్టార్ బ్లాక్ కలర్ హుడి డ్రెస్సులో స్టైలీష్‌గా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ కారు దిగగానే బాలయ్య హగ్ చేసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతూ పెద్దగా కేకలు పెట్టారు. అయితే, సంక్రాంతికి ఈ షో రిలీజ్ అవుతుందని ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు ఆహా మేనేజ్‌మెంట్‌ షాకిచ్చినంత పని చేసిందట. షో విడుదల చేయాలంటే, ఇంకాస్త సమయం పట్టేలా ఉందని లీకులు ఇస్తుందట. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్‌- 1 తరువాత పార్టు2 రిలీజ్ చేసి, పవన్ షో‌ను కాస్త లేట్‌ చేయాలని ఆహా ఫిక్సయిందట. పవన్ ఎపిసోడ్‌కు ఖాతాదారుల సంఖ్య పెరగాలంటే ప్రమోషన్స్ భారీగా చేయాలి. అన్నీ అయ్యాక ఫిబ్రవరిలో పవర్‌స్టార్‌ షోతో బాలయ్య బంపర్‌ ఆఫర్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Updated On 7 Feb 2023 8:32 AM GMT
Ehatv

Ehatv

Next Story