బాలకృష్ణ(Balakrishna) సినిమా వస్తున్నదంటే చాలు తెలుగునాట సందడే సందడే. ఆయనకు ఫాలోయింగ్‌ కూడా ఎక్కేవే. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను బాలకృష్ణ అందించారు. మాస్ ని మెప్పించే సినిమాలను మరెన్నో చేశారు.

బాలకృష్ణ(Balakrishna) సినిమా వస్తున్నదంటే చాలు తెలుగునాట సందడే సందడే. ఆయనకు ఫాలోయింగ్‌ కూడా ఎక్కేవే. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను బాలకృష్ణ అందించారు. మాస్ ని మెప్పించే సినిమాలను మరెన్నో చేశారు. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం NBK109తో మాస్ ని అలరించడానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో(Bobby kolli) చేతులు కలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainment) ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు(Balakrishna Birthday) సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. మహాశివరాత్రి(Mahashiva ratri) పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ మరింత ఆకర్షణగా ఉంది. సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో నటిస్తున్నారు.

Updated On 10 Jun 2024 3:23 AM GMT
Ehatv

Ehatv

Next Story