నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) ఇవాళ 65వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. బర్త్‌డే సందర్బంగా ఆయన కొత్త సినిమా ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను(Boyapati srinu) దర్శకత్వం వహిస్తున్నాడు.

నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) ఇవాళ 65వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. బర్త్‌డే సందర్బంగా ఆయన కొత్త సినిమా ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను(Boyapati srinu) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్టయ్యాయి. బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని BB4 పేరుతో ఒక పోస్టర్‌ను(Posters) మేకర్స్‌ విడుదల చేశారు. 14 రీల్స్ ప్లస్‌ నిర్మాణ సంస్థ రామ్ ఆచంట,గోపీచంద్(Gopichand) ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పదేళ్ల కిందట లెజెండ్‌(Legend) సినిమాను ఇదే నిర్మాణ సంస్థ రూపొందించింది. సింహా,లెజండ్‌, అఖండ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను -బాలయ్య కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. ఆమె చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.

Updated On 10 Jun 2024 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story