మంచి ఊపు మీద ఉన్నాడు బాలయ్య.. యంగ్ హీరోలను మించి దూకుడు చూపిస్తున్నాడు. వరుస సినిమాలను సెట్స్ ఎక్కిస్తున్నాడు నటసింహం.. వరుస హిట్లు కూడా కొడుతున్నాడు. ఈక్రమంలో తన కు చాలా కాలం తరువాత సూపర్ హిట్ తో పాటు.. భారీ కలెక్షనస్ ను సాధించి ఇచ్చిన సినిమాకు సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ను రెడీ చేస్తున్నాడు స్టార్ హీరో.

బాలకృష్ణ (Balakrishna) హీరోగా ఊరమాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్ లో తెరకెక్కిన.. భారీ సినిమా అఖండ. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు.. బాలయ్య కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ ను సాధించింది. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన ఈసినిమా బాలయ్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిపోయింది. అంతే కాదు డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ అదరగొట్టారు.. బాలయ్య మాస్ యాక్షన్ తో పాటు.. అఘోరాగా బాలకృష్ణ విశ్వరూపం చూపించారు.

ఎప్పుడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ను బాలయ్య చేయడంతో ఫ్యాన్స్ ఈసినిమాను విపరీతంగా చూశారు. ఆడియన్స్ అందరికి సినిమా బాగా నచ్చింది. యాక్షన్ సీన్స్ తో పాటు ఈ సినిమాకి సంగీతం ప్రధానమైన బలంగా నిలిచింది. తమన్ స్వరపరిచిన పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈసినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ విషయాన్ని ఓ మోస్తరులో బోయపాటి కూడా గతంలోనే చెప్పేశారు. కాని నిజంగా వస్తుందా అని అంతా అనుకున్న టైమ్ లో .. సీక్వెల్ సనిమాకు సబంధించి ఓన్యూస్ వైరల్ అవుతోంది.

జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు. ఆ రోజున ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ తో పాటు.. ఓపెనింగ్ పూజా కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లోగా సినిమాపై అఫీషియల్ం అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అఖండ(Akhanda), వీరసింహారెడ్డి (Veera Simhareddy) సినిమాల తరువాత అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు బాలయ్య. కాజల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమాతో హ్యాట్రిక్ హిట్ కొటంటాలని ప్లాన్ చేశాడు. ఈమూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసీ.. జూన్ లో అతఖండ సీక్వెల్ షూట్ లో జాయిన్ అవుతారట బాలయ్య , బోయపాటి టీమ్.

Updated On 27 March 2023 11:56 PM GMT
rj sanju

rj sanju

Next Story