బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా లాక్‌డౌన్‌ ముగుస్తున్న సమయంలో, సీజన్‌ కానీ డిసెంబర్‌లో సినిమా రిలీజైంది. అయినప్పటికీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. పెద్ద మొత్తంలో వసూళ్లు సాధించింది. సినిమా హిట్‌ అవ్వగానే తప్పకుండా సీక్వెల్‌ తీస్తామని మేకర్స్‌ ప్రకటించారు. ఇంతకాలానికి అఖండ సీక్వెల్‌ను అనౌన్స్‌ చేశారు. అఖండ 2 అనే టైటిల్‌కి తాండవం(Thaandavam) అనే ట్యాగ్ లైన్ జోడించారు. మొదటి భాగం ఆగిన చోటు నుంచే రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందో ఈ సినిమాలో చూపిస్తారు. స్కంద సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయిన తర్వాత బోయపాటి శ్రీను(Boyapati Srinu ) పెద్దగా కనిపించడం లేదు. అఖండ 2 స్క్రిప్ట్‌ పనిలో బిజీగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడా స్క్రిప్ట్‌ పనులు పూర్తవ్వడంతో సినిమాను అఫిషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఇవాళ పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ(BalaKrishna) దర్శకుడు బాబీ(Director Bobby) సినిమాలో నటిస్తున్నారు. ఈ డిసెంబర్‌కు ఈ సినిమా పూర్తవుతుంది. తర్వాత అఖండ-2(Akhanda 2)లో నటిస్తారు బాలయ్య. అఖండ-2కు తమన్‌ (Thaman)సంగీతాన్ని అందిస్తున్నారు.

ehatv

ehatv

Next Story