కాజల్‌ అగర్వాల్‌(Kajal Aggarwal).. ఓ తరం ప్రేక్షకుల గుండె చప్పుడు. అప్పట్లో కాజల్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉండింది. కుర్రకారంతా ఈ చందమామ సినిమా కోసం చకోర పక్షిలా ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. అంతలా యూత్‌లో తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు కాజల్‌. లక్ష్మీ కల్యాణం(Lakshmi Kalyanam) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కాజల్‌ తర్వాత చందమామతో(Chandamama) మంచి పేరు సంపాదించుకున్నారు.

కాజల్‌ అగర్వాల్‌(Kajal Aggarwal).. ఓ తరం ప్రేక్షకుల గుండె చప్పుడు. అప్పట్లో కాజల్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉండింది. కుర్రకారంతా ఈ చందమామ సినిమా కోసం చకోర పక్షిలా ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. అంతలా యూత్‌లో తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు కాజల్‌. లక్ష్మీ కల్యాణం(Lakshmi Kalyanam) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కాజల్‌ తర్వాత చందమామతో(Chandamama) మంచి పేరు సంపాదించుకున్నారు. మగధీర(Magadhera), డార్లింగ్‌(darling), బృందావనం(Brindhavanam), మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌(Mr.Perfect) వంటి భారీ హిట్లతో టాప్‌ రేంజ్‌లోకి దూసుకెళ్లారు. కాజల్‌ కాల్‌షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూసేవారు.

ఇప్పుడు దక్షిణాదిలో అత్యధిక పారితోషికాన్ని తీసుకునే నటీమణులలో కాజల్‌ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ ముంబాయి బ్యూటీ చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ(nandhamuri balakrishna) హీరోగా నటిస్తున్న భగవంత్‌ కేసరి(Bagavanth kesari) ఒకటి. అనిల్‌ రావిపూడి(anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. సోమవారం కాజల్‌ బర్త్‌డే .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్‌ ఈ సినిమాలోని కాజల్‌ ఫస్ట్‌లుక్‌(First look) పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్ర్‌లో కాజల్‌ ఓ చేతిలో పుస్తకాన్ని పట్టుకుని మరో చేతిలో ఫోన్‌ పట్టుకుని కాల్‌ మాట్లాడుతున్నట్టుగా ఉంది. కళ్లజోడు పెట్టుకుని క్యూట్ లుక్స్‌తో కాజల్‌ ఎంతో అందంగా ఉన్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్‌ నటిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్‌ రిలీజయ్యింది. టీజర్‌తోనే భారీ అంచనాలను సృష్టించింది. మరో ముఖ్య పాత్రలో శ్రీలీల(sreeleela) నటిస్తున్న భగవంత్‌ కేసరి సినిమా విజయదశమి కానుకగా విడుదల కాబోతున్నది. ప్రస్తుతం కాజల్‌ టాప్‌ స్టార్లతో నటిస్తున్నారు.

కమలహాసన్‌(Kamal Hassan) కథానాయకుడిగా దర్శకుడు శంకర్‌ రూపొందిస్తున్న ఇండియన్‌-2లో(Indian-2) కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దలపతి విజయ్‌ సరసన ఓ సినిమా చేస్తున్నారు. వీటితో పాటుగా ఉమా, పారిస్‌ పారిస్‌ అనే రెండు తమిళ సినిమాలో కూడా నటిస్తున్నారు. తెలుగులో సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్‌ చిత్రాన్ని చేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. సినిమాలే కాకుండా కాజల్‌ వెబ్‌ సిరీస్‌లను కూడా చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్‌ అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకున్నారు కాజల్‌ అగర్వాల్‌.

Updated On 19 Jun 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story