నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పండగే పండగ. బాలయ్య సినిమా సంక్రాంతికో, దసరాకో, దీపావళికో వచ్చిదంటే డబుల్‌ పండుగ. ఇప్పుడు ఫ్యాన్స్‌కు రెండు పండుగలు రాబోతున్నాయి. బాలయ్య నటిస్తున్న భగవంత్‌ కేసరి సినిమా విజయదశమికి రాబోతున్నది. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పండగే పండగ. బాలయ్య సినిమా సంక్రాంతికో, దసరాకో, దీపావళికో వచ్చిదంటే డబుల్‌ పండుగ. ఇప్పుడు ఫ్యాన్స్‌కు రెండు పండుగలు రాబోతున్నాయి. బాలయ్య నటిస్తున్న భగవంత్‌ కేసరి (Bhagwant Kesari) సినిమా విజయదశమికి రాబోతున్నది. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా థియేటర్లలోకి రానుంది.. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తోంది చిత్ర యూనిట్‌. ఇందులో భాగంగా లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. ఈ సినిమా కోసం సిద్ధం చేసిన ఓ భారీ సెట్‌లో బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్‌లో ఓ భారీ ఫైటింగ్‌ సీన్‌ను కూడా చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆగస్టు నెలఖారు నాటికి షూటింగ్‌ కంప్లీట్‌ చేయాలని అనుకుంటున్నారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. శ్రీలీల(Sreeleela) , అర్జున్‌ రాంపాల్‌ (Arjun Rampal) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated On 17 Jun 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story