తెలుగు సినిమాలకు సంబంధించిన వరకు నందమూరి బాలకృష్ణ(Balakrishna) స్టార్ హీరోనే! అతడికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. 60 ఏళ్లు దాటినప్పటికీ కుర్రహీరోలతో పోటీగా నటిస్తున్నాడు. ఆయన సినిమాలు సర్‌ప్రైజ్ హిట్ అవుతాయి. ఆయన నటిస్తే చూడటానికి ఇబ్బందేమీ ఉండదు కానీ పాట పాడితే మాత్రం భరించడం కష్టం..
తెలుగు సినిమాలకు సంబంధించిన వరకు నందమూరి బాలకృష్ణ(Balakrishna) స్టార్ హీరోనే! అతడికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. 60 ఏళ్లు దాటినప్పటికీ కుర్రహీరోలతో పోటీగా నటిస్తున్నాడు. ఆయన సినిమాలు సర్‌ప్రైజ్ హిట్ అవుతాయి. ఆయన నటిస్తే చూడటానికి ఇబ్బందేమీ ఉండదు కానీ పాట పాడితే మాత్రం భరించడం కష్టం.. ఫ్యాన్స్ మాత్రం మా బాలయ్య ముందు ఘంటసాల కూడా బలాదూర్ అంటారనుకోండి.. ఆ మధ్యన బాలయ్య శివశంకరి పాట పాడి గాయకుడని నిరూపించుకోవాలనుకున్నారు కానీ ఆ పాట విని చాలా మంది గాయాలపాలయ్యారని పాపం ఆయనకు తెలిసి ఉండదు. జగదేకవీరుని కథలోని ఆ పాట ఎవర్‌గ్రీన్. అలాంటి పాటను బాలయ్యబాబు కైమా చేశారు. ఇప్పుడా పాట వినాలంటే భయమేస్తుంది. ఈ పాట పాడేందుకు చాలా ప్రాక్టీస్ చేశానని చెప్పుకున్నాడు బాలయ్య. అంత అద్భుతమైన పాటను బాలయ్య పాడటంపై చాలా మంది విమర్శించారు. నాగబాబు(Nagababu) అయితే కరోనా కంటే ప్రమాదకరమైన సంగీతం సర్క్యూలేట్ అవుతోంది జాగ్రత్త అంటూ ట్విట్టర్‌లో సెటైర్ విసిరారు ! ఎందుకొచ్చిన కాంట్రవర్సరీ అనుకుని తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. బాగోలేదని చెబితే కొడతారేమోనన్న భయంతో చాలా మంది మూసుకుని ఉన్నారు. ఇప్పుడు మానిపోయిన గాయాన్ని ఎందుకు కెలుతున్నారంటారా? మళ్లీ పాడపాడాలన్న మూడ్ బాలయ్యకు వచ్చిందట! అంటే మనకు మూడిందనే అర్థం! అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటానని, మామా ఎక్ పెగ్‌లా అని అంటుంటానని, ఇంకా చాలా పాడానని చెప్పుకొచ్చారు బాలయ్య. తన పాటలు చాలా ఉన్నాయని, నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకొస్తాయని, మీరు చూస్తూ ఉండండి అని ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పనిలో పనిగా తెలుగు ప్రేక్షకులకు కితాబిచ్చారు. వారిది చాలా పెద్ద మనసని, తన కోసం వాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు బాలయ్య. సినిమాలోని అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలన్నదే తన అభిమతమని, ఓ దశలో కెమెరామెన్ కూడా అవుదామనుకున్నానని చెప్పుకొచ్చారు బాలయ్యబాబు. ఇప్పుడు పాటలు కూడా పాడుతున్నానని, మంచి సమయం చూసి తను పాడిన పాటను వదులుతానని బాలయ్య నిర్మోహమాటంగా చెప్పారు.